Home /News /movies /

TAMIL STAR HERO VIJAY FANS FOLLOWED HIS CAR TO MEET HIM TA

అపుడు అజిత్.. ఇపుడు విజయ్.. ఫ్యాన్స్‌తో తప్పని తిప్పలు..

విజయ్, అజిత్ ఫైల్ ఫోటోస్

విజయ్, అజిత్ ఫైల్ ఫోటోస్

తమిళనాట హీరో విజయ్‌కు గల క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే. రజినీకాంత్ తర్వాత తమిళనాట నెంబర్ వన్ హీరోగా క వెలుగు వెలుగుతున్నాడు. ఈయన షూటింగ్ నిమిత్తం బయటకు వచ్చాడంటే చాలా అభిమానులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. తాజాగా విజయ్‌ను ఇబ్బందికి గురిచేసే  అలాంటి సంఘటనే రీసెంట్‌గా చెన్నైలో జరిగింది.

ఇంకా చదవండి ...
తమిళనాట హీరో విజయ్‌కు గల క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే. రజినీకాంత్ తర్వాత తమిళనాట నెంబర్ వన్ హీరోగా క వెలుగు వెలుగుతున్నాడు. ఈయన షూటింగ్ నిమిత్తం బయటకు వచ్చాడంటే చాలా అభిమానులను కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. అందుకే ఆయనతో ఔట్ డోర్ షూటింగ్స్ అంటేనే నిర్మాతలు, దర్శకులు భయపడే పరిస్థితి వచ్చింది. ఒక్కోసారి ఈ అతి అభిమానంతో విజయ్ ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విజయ్‌ను ఇబ్బందికి గురిచేసే  అలాంటి సంఘటనే రీసెంట్‌గా చెన్నైలో జరిగింది. ప్రస్తుతం విజయ్..అట్లీ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న తెలిసిందే. చెన్నైలోని కాలేజ్‌లో ఈ సినిమా షూటింగ్‌ను ముగించుకొని విజయ్ తన కారులో ఇంటికి బయలుదేరారు. కొంతమంది యువకులు విజయ్‌ను చూసి తలైవా..తలైవా అని పిలుస్తూ తమ బైకులతో ఆయన కారును అనుసరించారు. వాళ్లు కారుతో సమానంగా బైకులపై వస్తుండటంతో టెన్షన్ పడ్డ విజయ్..కారు అద్దాన్ని కిందికి దించి..ఆగిపొమ్మని వెనక్కి పొమ్మని సైగచేసాడు.తాజాగా కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటనే అజిత్‌కు కూడా ఎదురైంది. ఆయన కూడా ఇలాగే అభిమానులను సర్ధిచెప్పి పంపించేసాడు.
First published:

Tags: Ajith, Kollywood, Tamil Cinema, Vijay

తదుపరి వార్తలు