news18-telugu
Updated: October 6, 2019, 9:10 PM IST
‘విజిల్’ మూవీ (twiter/Photo)
విజయ్ ఇమేజ్ ప్రస్తుతం తమిళనాట ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరస విజయాలతో నెంబర్ వన్ అయిపోతున్నాడు ఇళయ దళపతి. ఇప్పుడు ఈయన అట్లీ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో ‘తేరి’ ‘మెర్సల్’ రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి సంచలనానికి తెరలేపారు. ఈ సినిమాకు తమిళంలో ‘బిగిల్’ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు తెలుగులో ‘విజిల్’ టైటిల్ ఖరారు చేసారు. అంతేకాదు ఈ సంబంధించిన పోస్టర్‌ను దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేసారు. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఒలంపిక్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు అట్లీ కుమార్. అక్కడ జరిగే అన్యాయాలపై చూపిస్తున్నాడు అట్లీ.

తెలుగులో ‘విజిల్’ టైటిల్‌తో రానున్న విజయ్ ‘బిగిల్’ మూవీ (twitter/Photo)
ఇందులో విజయ్ ఫుట్ బాల్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇదివరకు ఈయన విజయ్ తో తెరకెక్కించిన ‘తెరీ’.. ‘మెర్సల్’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. ఇందులో ‘మెర్సల్’ కోసం ఏకంగా మెడికల్ మాఫియాను కదిలించాడు దర్శకుడు అట్లీకుమార్. ఇక ఇప్పుడు ఏకంగా ఒలంపిక్స్నే టార్గెట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా నటిస్తున్నాడు విజయ్. ఇందులో విజయ్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు దళపతి. ఈ సినిమాలో సాకర్ టీం కోసం 16 మంది అమ్మాయిలను తీసుకున్నాడు దర్శకుడు అట్లీ. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

ఇళయతలపతి విజయ్
గతంలో ‘చక్ దే ఇండియా’లో హాకీ కోచ్‌గా నటించాడు కింగ్ ఖాన్. ఇప్పుడు అలాంటి మహిళా టీం కోచ్ పాత్రలోనే విజయ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాపై తమిళనాడులో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే శాటిలైట్, డిజిటల్ హక్కుల రూపంలో ఓ ఛానెల్ ఏకంగా 50 కోట్లు చెల్లించిందని తెలుస్తుంది. తమిళనాట ఓ ప్రముఖ ఛానెల్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లతో బిగిల్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ రూ.40 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

విజయ్ ఫైల్ ఫోటో
తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వివేక్, యోగిబాబు, డేనియల్ బాలాజీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్. విల్లు తర్వాత మరోసారి ఈ జోడీ కలిసి నటిస్తున్నారు. మొత్తానికి తెరీ, మెర్సల్ తర్వాత విజయ్, అట్లీ మరో సంచలనానికి తెరతీస్తున్నారు. తెలుగులో కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అదిరింది, సర్కార్ సినిమాల తర్వాత తెలుగులో విజయ్ మార్కెట్ బాగానే పెరిగింది. మరి ‘విజిల్’తో విజయ్ తెలుగులో మరో విజిల్ వేస్తాడా లేదా అనేది చూడాలి.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
October 6, 2019, 9:08 PM IST