• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TAMIL STAR HERO UDHAYANIDHI STALIN ATTENDS FOR AN INTERVIEW FOR ELECTIONS 2021 PK

Udhayanidhi Stalin: అసెంబ్లీ టికెట్ కోసం ఆడిషన్స్‌కు అటెండ్ అయిన స్టార్ హీరో..

Udhayanidhi Stalin: అసెంబ్లీ టికెట్ కోసం ఆడిషన్స్‌కు అటెండ్ అయిన స్టార్ హీరో..

ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin/Instagram)

Udhayanidhi Stalin: సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్లే అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంటారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి హీరోలుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్లు కూడా లేకపోలేదు. అలా వచ్చిన హీరో ఉదయనిధి స్టాలిన్.

  • Share this:
సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం కొత్త కాదు. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్లే అప్పుడప్పుడూ సినిమాలు కూడా చేస్తుంటారు. పొలిటికల్ బ్యాగ్రౌండ్ నుంచి హీరోలుగా వచ్చి సక్సెస్ అయిన వాళ్లు కూడా లేకపోలేదు. అలా వచ్చిన హీరో ఉదయనిధి స్టాలిన్. ఈయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నాడు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో  సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు.తెలుగునాట అన్న ఎన్టీఆర్ తెలుగు దేశం అనే రాజకీయ పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. అంతకు ముందు ఎంజీఆర్ కూడా ఏఐఏడీఎంకే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కదా. అదే బాటలో తెలుగులో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్లాపించారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీని స్థాపించి ఎన్నికల రంగంలోకి ఉన్నారు. ఇంకోవైపు తమిళనాట విజయకాంత్.. ఎండీఎంకే పార్టీని స్థాపించి ప్రతిపక్ష నాయకుడి స్థాయికి ఎదిగారు. అదే బాటలో కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. తాజాగా తమిళనాట కరుణానిధి మనవడు .. స్టాలిన్ కుమారుడు.. తమిళనాట ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్.
Udhayanidhi Stalin,tamil nadu Assembly Elections 2021,Udhayanidhi Stalin chennai chepauk Assembly Constituency,tollywood Actors,kollywood,Tamilnadu,ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి మనవడు హీరో ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ (udhayanidhi stalin)

త్వరలో జరగనున్న తమిళనాట అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నెలోని ‘చెపాక్’ నియోజకవర్గం నుంచి డీఎంకే తరుపన పోటీ చేస్తున్నాడు. ప్రస్తుతం పార్టీ యువజన సంఘ అధ్యక్షుడిగా ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్. ఈ నేపథ్యంలోనే మార్చ్ 6న పార్టీ పెద్దల ముందు ప్రధాన కార్యాలయం అణ్ణా అరివాలయంలో హాజరయ్యాడు. అక్కడ ఉదయనిధిని ఇంటర్వ్యూ చేసారు పార్టీ అధ్యక్షుడు, ఉదయనిధి తండ్రి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి దురై మురుగన్.
Udhayanidhi Stalin,tamil nadu Assembly Elections 2021,Udhayanidhi Stalin chennai chepauk Assembly Constituency,tollywood Actors,kollywood,Tamilnadu,ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్,తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి మనవడు హీరో ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ఎన్నికల బరిలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి (Twitter/Photo)

పార్టీ టికెట్ కోసం కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయా లేదా అని ఉదయనిధిని ఇంటర్వ్యూ చేసారు. మరోవైపు తమిళ ఎన్నికల్లో ఖుష్బూ, గౌతమి వంటి వాళ్లు బీజేపీ తరుపున అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. అంతేకాదు మరికొంత మంది సినీ నటులు వేర్వేరు పార్టీల నుంచి అసెంబ్లీ బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తంగా తమిళనాడు ఎన్నికల బరిలో ఇపుడు సినీ నటులు జాతర జరగనుంది.
Published by:Praveen Kumar Vadla
First published: