హోమ్ /వార్తలు /సినిమా /

సూర్య క్రేజ్ మాములుగా లేదుగా.. అందుకు రుజువు ఇదిగో..

సూర్య క్రేజ్ మాములుగా లేదుగా.. అందుకు రుజువు ఇదిగో..

సూర్య (Instagram/Photo)

సూర్య (Instagram/Photo)

తమిళ హీరో సూర్యకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు తమిళంలో పాటు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా సూర్య మరో రికార్డు క్రియేట్ చేసాడు.

  తమిళ హీరో సూర్యకున్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు తమిళంలో పాటు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ గత కొన్నేళ్లుగా ఈ కథానాయకుడికి సరైన సక్సెస్ మాత్రం అందడం లేదు. మంచి స్టోరీ పడితే.. బాక్సాఫీస్ షేక్ చేయగల సత్తా ఈ గజినీ సొంతం. రీసెంట్‌గా ఈయన తన పుట్టినరోజును కరోనా నేపథ్యంలో సింపుల్‌గా కానేచ్చాడు. అంతేకాదు పుట్టినరోజు సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. అందులో కలైపులి ఎస్ థాను నిర్మించే ‘వాడి వాసల్’ అనే సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించాడు. ఈ సినిమాను జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తన పుట్టినరోజైన  జూలై 23న ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌‌ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ అయ్యారు.అంతేకాదు ఎంట్రీ ఇచ్చిన 24 గంటల వ్యవధిలోనే ఈయన్ని ఫాలో అయ్యే వారు 1.4 మిలియన్‌కు చేరుకుంది. ఒక్కరోజులోనే ఇంత మంది సూర్యను ఫాలో అవ్వడం చూస్తుంటే.. హీరోగా సూర్య క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ సందర్భంగా సూర్య మనతో ఎలాంటి రక్త సంబంధం లేకుండా తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసాడు. ఇలాంటి అభిమానులు ఉండటం తన అదృష్టమన్నాడు.

  View this post on Instagram

  Feeling super lucky to have such unconditional love!! Thank you guys for making me believe in what I do.. Love you all!!


  A post shared by Suriya Sivakumar (@actorsuriya) on  సరిగ్గా రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మూడు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అందులో ఒకటి భార్య జ్యోతికతో ఉన్నది ఒకటైతే.. రెండోది తన ఫోటోను షేర్ చేసాడు. ప్రస్తుతం సూర్య ఇన్‌స్టాగ్రామ్‌లో నలుగురిని ఫాలో అవుతున్నాడు. అందులో ఆయన బ్రదర్ హీరో కార్తి కాగా.. రెండోది ఆయన సిస్టర్ బృందా, బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ పాండియన్, నాల్గోది తన ప్రొడక్షన్ హౌస్ 2 డీ ఎంటర్టైన్మెంట్‌ను ఫాలో అవుతున్నాడు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Suriya, Tollywood

  ఉత్తమ కథలు