TAMIL STAR HERO MADHAVAN TO PLAY FATHER CHARECTER OF VARUN TEJ LATEST MOVIE TA
వరుణ్ తేజ్ తండ్రిగా నటిస్తోన్న స్టార్ హీరో..
వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కొత్త సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో వరుణ్ తండ్రి పాత్రలో స్టార్ హీారో నటించబోతున్నట్టు సమాచారం.
ఈ యేడాది సీనియర్ హీరో వెంకటేష్‌తో కలిసి చేసిన ‘ఎఫ్ 2’ తో మంచి సక్సెస్ అందుకున్నాడు వరుణ్ తేజ్. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కొత్త సినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో వరుణ్ తేజ్.. బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ తండ్రిపాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ పూర్తిగా మేకోవర్ కానున్నాడు. ఇప్పటికే సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తున్న వరుణ్ తేజ్.. ఈ సినిమా కోసం బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకున్నాడు. మాధవన్ విషయానికొస్తే.. తెలుగులో గతేడాది నాగ చైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’ చిత్రంలో తెలుగులో నటించారు. తాజాగా వరుణ్ తేజ్ చిత్రానికి సంతకం చేసినట్టు సమాచారం.
వరుణ్ తేజ్, మాధవన్ (File Photos)
ఈ సినిమా స్టోరీ ప్రకారం తండ్రి మంచి బాక్సర్. అతను బాక్సర్‌గా సాధించలేనిది.. తన కొడుకుతో ఎలా తన తీరని కోరికను ఎలా నెరవేర్చుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. మొత్తానికి కొత్త దర్శకుడుతో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో వరుణ్ తేజ్ మరో హిట్టు అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.