Karthi - Viruman : కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. Karthi - Viruman : కార్తి గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సూర్య తమ్ముడుగా ఇక్కడికి వచ్చిన ఈయన.. కార్తి అన్న సూర్య అనే స్థాయికి ఎదిగాడు. ఓ రకంగా చెప్పాలంటే అన్న కంటే ఎక్కువగా తెలుగు మార్కెట్ సొంతం చేసుకున్నాడు కార్తి. ఆయన సినిమాలు ఒకప్పుడు వరస విజయాలను కూడా అందుకున్నాయి. యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో తెలుగులో కార్తి ఇమేజ్ భారీగానే పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన దొంగ, సుల్తాన్ మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.ఈయన హీరోగా నటించిన ఖైదీ విషయానికొస్తే.. ఈ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు కార్తి. ఈ సినిమా తెలుగులో కూడా సంచలన విజయం సాధించింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఖైదీ. దానికి ముందు ఖాకీ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. కెరీర్ పరంగా మంచి హైట్స్‌లో ఉన్నాడు ఈయన. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘విరుమాన్’ సినిమాతో పలకరించనున్నారు.
#Viruman arriving on August 31st 🔥🔥@Karthi_Offl @Suriya_offl @dir_muthaiya @rajsekarpandian @2D_ENTPVTLTD @prakashraaj #Rajkiran @sooriofficial @selvakumarskdop @venkatraj11989 @ActionAnlarasu @jacki_art @VinothiniRK @editorNash @sonymusicsouth pic.twitter.com/DxRmGtiocJ
— Aditi Shankar (@AditiShankarofl) May 18, 2022
ఈ సినిమాను ముత్తయ్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగష్టు 31న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమాతో కార్తి మరో విజయాన్ని అందుకుంటారా లేదా అనేది చూడాలి.ఈ మధ్య సూర్య కాస్త విజయాల విషయంలో వెనకబడినా కూడా కార్తి మాత్రం కుమ్మేస్తున్నాడు. కానీ ఓటీటీ వేదికగా మాత్రం సూర్య మంచి సక్సెస్‌లు అందుకున్నారు. హిట్స్ కొట్టినా కొట్టకపోయినా కూడా సూర్య ఇమేజ్ మాత్రం అలాగే ఉంది. ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సూర్య. ఇదిలా ఉంటే ఇప్పుడు కార్తి, సూర్య కలిసి మల్టీస్టారర్ ఒకటి చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.