Kamal Haasan - Bigg Boss 5 : తెలుగులో బిగ్ బాస్ షోకు హోస్టులు మారారు కానీ తమిళనాట మాత్రం ముందు నుంచి ఒక్కరే ఉన్నారు. ఆయనే లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). తొలి సీజన్ నుంచి మొన్న పూర్తైన నాలుగో సీజన్ వరకు ఆయనే హోస్ట్ చేసారు. ఐతే.. ఐదో సీజన్ నుంచి ఆయన తప్పుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్‌గా కమల్ హాసన్ ఐదో సీజన్‌కు కూడా ఆయనే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గత కొన్నేళ్లుగా కమల్ హాసన్ .. సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. కానీ పొలిటిక్స్‌లో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేక చతికిలబడింది. స్వయంగా ఆ పార్టీ అధినేత అయిన కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి సమీప బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు.
రాజకీయాల్లో ఓటమి పాలు కావడంతో కమల్ హాసన్ మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయారు. ఒకవేళ ఎన్నికల్లో గెలిచి ఉంటే.. సినిమాలతో పాటు బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలను పులిస్టాప్ పెట్టి ఉండేవారు. అంతేకాదు గత బిగ్‌బాస్ సీజన్ 4 తర్వాత సీజన్ 5 ను హోస్ట్ చేయనంటూ ప్రకటనలు కూడా చేశారు. తీరా ఫలితం అనుకూలంగా రాకపోవడంతో ఇపుడు బిగ్‌బాస్ సీజన్ 5కు మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు కమల్ హాసన్.
బాలయ్య సినిమా టైటిల్‌తో బాక్సాఫీస్ పై గర్జించడానికి రెడీ అవుతున్న షారుఖ్ ఖాన్..
ఈయన హోస్ట్‌గా తమిళ బిగ్‌బాస్ అక్టోబర్ 3 నుంచి విజయ్ టీవీలో 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ అఫీషియల్‌గా ప్రకటించారు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తైయ్యాయి. ఈ సారి తమిళ బిగ్‌బాస్‌లో కాంట్రవర్సీలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసినట్టు సమాచారం. బిగ్ బాస్ షో గురించి మన దగ్గర కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎక్కడో విదేశాల్లో రప్ఫాడించిన ఈ షోను హిందీ వాళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్‌లలో కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది బిగ్ బాస్. దాంతో అందరూ కూడా ఈ ఇంటిపై బాగానే కన్నేసారు ఇప్పుడు.
రియాలిటీ షోలు అంటేనే మొహం తిప్పుకునే దక్షిణాది ప్రేక్షకులు కూడా ఈ కాన్సెప్టుకు ఫిదా అయిపోయారు. అందుకే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలోనూ బిగ్ బాస్ షో అప్రతిహతంగా కొనసాగుతుంది. కరోనా వంటి ప్యాండమిక్లోనూ దుమ్ము దులిపేసింది బిగ్ బాస్ షో. మలయాళంలో అందరికంటే ముందు మొదలై రచ్చ చేస్తుంది.
కమల్ హాసన్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నారు. దాంతో పాటు శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన ‘భారతీయుడు 2’ సినిమా కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ శంకర్ మాత్రం కమల్ హాసన్ సినిమా ఒదిలిపెట్టి.. రామ్ చరణ్ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bigg Boss 5 Tamil, Kamal haasan