నిర్మాతలపై ధనుశ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

కొంత మంది తమిళ నిర్మాతలపై ధనుశ్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: September 4, 2019, 12:04 PM IST
నిర్మాతలపై ధనుశ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
ధనుశ్ (file Photo)
news18-telugu
Updated: September 4, 2019, 12:04 PM IST
కొంత మంది తమిళ నిర్మాతలపై ధనుశ్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ధనుశ్ ఇటీవలె చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొంత మంది నిర్మాతలు నటులను మోసం చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు వారి నుంచి పారితోషకం తీసుకోవడానికి తల ప్రాణం తోకకు వస్తుందంటూ ఆరోపించారు. పారితోషకం కోసం వారి చుట్టూ తిరుగాల్సి వస్తుందన్నారు. దీని కోసం ఉన్న పనులను మానుకోని వారి చుట్టు ప్రదక్షణాలు చేయాల్సి వస్తుందన్నంటూ వ్యాఖ్యలు చేసాడు. ధనుశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై తమిళ నిర్మాతలు మండిపడుతున్నారు.

ధనుశ్ (File Photo)


మరోవైపు అళగప్పన్ అనే నిర్మాత మాట్లాడుతూ.. విజయ్, అజిత్ వంటి హీరోలు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ధనుశ్ వంటి హీరోలు మాత్రం నిర్మాతలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించరని పేర్కొన్నారు. మరోవైపు ధనుశ్ హీరోతో పాటు నిర్మాత అన్న విషయం మరవొద్దు అంటూ గుర్తు చేసారు. మరోవైపు ధనుశ్‌తో సినిమాలు తీసిన వాళ్లు తీవ్రంగా నష్టపోయారన్నారు.

 

First published: September 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...