Home /News /movies /

TAMIL STAR HERO DHANUSH NEW MOVIE WITH VENKY ATLURI SIR MOVIE TEASER RELEASED THIS IS REAL TALK TA

Dhanush Sir Teaser Talk : విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతోన్న ధనుశ్ ‘సార్’ టీజర్..

‘సార్’ మూవీ టీజర్ టాక్ (Twitter/Photo)

‘సార్’ మూవీ టీజర్ టాక్ (Twitter/Photo)

Dhanush Sir Teaser Talk : తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తోన్న బై లింగ్వల్ మూవీ ‘సార్’. ఈ రోజు ధనుశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  Dhanush Sir Teaser Talk : తమిళ స్టార్ హీరో.. జాతీయ ఉత్తమ నటుడు ధ‌నుష్ విషయానికి వస్తే.. ఆయన విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆయన సామాన్యుల జీవితాలను తెరపై చర్చిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈయన కేవలం తమిళంకే పరిమితం కాకుండా.. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ఇపుడు తెలుగు ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో డైరెక్ట్‌గా ఓ తెలుగు చిత్రంలో నటిస్తోన్న ధనుశ్.. దాంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘సార్’ సినిమా చేస్తున్నారు. ఈ రోజు ధనుశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వర: అనే ఆర్యోక్తి  అనుసరించి గురువును మనం త్రిమూర్తులతో సమానంగా పోలుస్తాము. అలాగే మాతృదేవోభవా, పితృదేవోభవ తర్వతా ఆచార్య దేవోభవా అంటూ తల్లి, తండ్రిల తర్వాత గురువులకు మన పురాణాలు పేర్కొంటాయి.

  అలాంటి గురువులు ఇపుడు కార్పోరేట్ మాయలో పడి నలిగిపోతున్నారు. ముఖ్యంగా ‘సార్’ టీజర్‌లో జీరో ఫీజ్.. జీరో ఎడ్యుకేషన్.. మోర్ ఫీజ్.. మోర్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం మన సమాజంలో నడుస్తోన్న ట్రెండ్‌ను ఈ సినిమాలో చక్కగా ఆవిష్కరించారు ‘సార్’ మూవీలో. తాజాగా విడుదల చేసిన టీజర్‌కు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది.


  ప్రస్తుతం దేశంలో నడుస్తోన్న విద్యా వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమాను రూపొందించారు. మన దగ్గరున్న బెస్ట్ లెక్చరర్‌ను గవర్నమెంట్ కాలేజీకి పంపిస్తే.. ఎలా అంటూ కార్పోరేట్ కాలేజీలో ఎలా వెనకుండి నడిపిస్తాయో ‘సార్’ మూవీలో చూపించారు. 90వ దశకంలో దేశంలో సరళీకృత ఆర్ధిక విధానాల కారణంగా విద్యా వ్యవస్థలో ప్రైవేటు గుత్తాధిపత్యం పెరిగిపోయింది. అక్కడ ఉన్న కార్పోరేట్ విద్యా సంస్థలు ఎలా స్కూల్లతో పాటు టీజర్లను శాసిస్తున్నాయో ఈ సినిమాలో చూపించనున్నాడు. ఈ కార్పోరేట్ విద్యా సంస్థలపై తిరగబడ్డ ఓ సామాన్య ఆచార్యుడు ఎలాంటి అనుభవాలను ఫేస్ చేసాడనేది ఈ సినిమా స్టోరీ.  ముఖ్యంగా విద్య అనేది దేవుడి గుడిలో పెట్టే నైవేద్యం లాంటిది అది అందరికీ పంచండి. ఫైవ్ స్టార్‌ హోటలో డిష్‌లాగా అమ్మకండి అని ధనుశ్ చెప్పే డైలాగులు బాగున్నాయి. తెలుగులో తొలి డైరెక్ట్ మూవీ అయినా.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడు. ధనుశ్ బాలగంగధర్ తిలక్ అనే లెక్చరర్ పాత్రలో అద్భుతంగా నటించారు. చివరగా మన రెండో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గెటప్‌లో ధనుశ్ లుక్ బాగుంది. మొత్తంగా ప్రస్తుతం సమాజంలో చదువు పేరిట జరగుతున్న దోపిడిని కళ్లకు కట్టినట్టు చూపించాడు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Dhanush, Kollywood, Sir Movie, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు