Home /News /movies /

TAMIL STAR HERO AJITH KUMAR FINANCIAL HELP TO IDLY SELLER FAMILY AND NEWS GOES VIRAL PK

Ajith help: రియల్ హీరో.. ఇడ్లీలు పెట్టిన విశ్వాసం లక్షలిచ్చి తీర్చుకున్న అజిత్..

అజిత్ కుమార్ (Ajith Kumar)

అజిత్ కుమార్ (Ajith Kumar)

Ajith help: హీరోలను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. వెండితెరపై హీరోల్లా కనిపించే వాళ్లు కూడా రియల్ లైఫ్‌లో అలా ఉండరు. చాలా మందికి డబ్బులుంటాయి కానీ సేవ చేసే గుణం ఉండదు. కానీ కొందరు మాత్రం రియల్, రీల్ లైఫ్‌లో హీరోలుగానే ఉంటారు.

హీరోలను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. వెండితెరపై హీరోల్లా కనిపించే వాళ్లు కూడా రియల్ లైఫ్‌లో అలా ఉండరు. చాలా మందికి డబ్బులుంటాయి కానీ సేవ చేసే గుణం ఉండదు. కానీ కొందరు మాత్రం రియల్, రీల్ లైఫ్‌లో హీరోలుగానే ఉంటారు. అలాంటి వాళ్ళలో అజిత్ ముందుంటాడు. ఈయన బయట కూడా తనను నమ్ముకున్న వాళ్ల కోసం ఎంత దూరమైనా వెళ్తుంటాడు. అందుకే తన దగ్గర పని చేస్తున్న దాదాపు 50 మందికి పైగా సొంత ఇల్లు కట్టించి గిఫ్టుగా ఇచ్చాడు. దాంతో పాటు లక్షల రూపాయలు గుప్త దానాలు చేస్తుంటాడు. అజిత్‌కు అంత ఇమేజ్ ఉండటానికి కారణం కూడా ఆయన వ్యక్తిత్వమే. సినిమాలతో పాటు సామాజిక సేవలోనూ ముందుంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇలాంటి పనే చేసాడు. అజిత్‌కు హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడే పుట్టి పెరిగి చదువుకున్నాడు అజిత్. సినిమాల్లోకి రాకముందు బైక్ మెకానిక్‌గా కూడా పని చేసాడు. సికింద్రాబాద్ ఏరియాలోనే ఉన్నాడు అజిత్. అంతేకాదు.. అజిత్ హీరోగా నటించిన తొలి సినిమా కూడా తెలుగులోనే. గొల్లపూడి మారుతిరావు కొడుకు శ్రీనివాస్ దర్శకుడిగా వచ్చిన ప్రేమ పుస్తకం సినిమాతో ఈయన హీరో అయ్యాడు. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి సూపర్ స్టార్ అయ్యాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈయన నటిస్తున్న ‘వాలిమై’ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్‌లోనే జరిగింది. ఈ షూటింగ్ జరిగినపుడు కొన్నిసార్లు తన సిబ్బందికి కూడా తెలియకుండా బయటికి వచ్చేవాడు అజిత్.

ajith kumar,ajith twitter,ajith help,ajith ildy seller help,ajith movies,ajith valimai movie shooting,ajith kumar financial help,telugu cinema,అజిత్ కుమార్,అజిత్ సాయం,ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి కుటుంబానికి అజిత్ సాయం
అజిత్ కుమార్ (Ajith Kumar)


బైక్‌పై చక్కర్లు కొడతాడు.. అలా కొన్నిసార్లు రాత్రి పూట తనకు దగ్గరలో ఉన్న ఇడ్లీ బండి వద్దకు వెళ్లేవాడు అజిత్. అలా వెళ్లినపుడు ఆ ఇడ్లీ బండి వ్యక్తి కుటుంబం గురించి.. పిల్లల గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన కుటుంబ పరిస్థితి.. పేదరికం గురించి తెలుసుకుని చలించిపోయాడు అజిత్. అక్కడితో ఆగకుండా తనకు ఇడ్లీలు పెట్టిన ఆ వ్యక్తి కుటుంబాన్ని ఆదుకున్నాడు. వాళ్లకు వెంటనే లక్ష రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం చేసాడు. ఇలా అజిత్ సాయం చేయడం ఇదే తొలిసారి కాదు. అప్పట్లో ఓ సినిమా షూటింగ్ సమయంలో కూడా టెక్నీషియన్స్‌కు ఇలాంటి సాయమే చేసాడు.

అజిత్ కుమార్ (Ajith Kumar)


ఓ సారి టెక్నీషియన్స్, డ్రైవర్స్‌కు నిర్మాతలు చాలా కాలంగా డబ్బులు ఇవ్వకపోతే.. వాళ్లు వెళ్లి అతడికి ఫిర్యాదు చేసారు. దానికి తననేం చేయమంటారు.. వెళ్లి నిర్మాతను అడగండి అంటూ అక్కడ వాళ్ల దగ్గర సమాధానం చెప్పాడు అజిత్. కానీ అక్కడ్నుంచి ఉన్నట్లుండి వెళ్లిపోయి హోటల్‌కు చేరుకున్నాడు. అదేంటని అడిగితే.. వాళ్లకు చాలా కాలంగా డబ్బులు ఇవ్వలేదంట.. ఇవ్వమనండి లేదంటే తాను వచ్చి క్లియర్ చేస్తానని చెప్పాడు అజిత్. అలా అందరికీ సాయం చేసాడు. ఇప్పుడు కూడా ఇడ్లీలు అమ్ముకునే వ్యక్తి కుటుంబాన్ని ఆదుకున్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ajith, Kollywood, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు