కాళ్లు పట్టుకుంటా అంటూ వెక్కివెక్కి ఏడ్చిన కమెడియన్..

Vadivelu: కరోనా వైరస్ ఇప్పుడు ఎంత తిప్పలు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాధితులు పడుతున్న నరకయాతన చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ మహమ్మారి రోజురోజుకూ..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 4:07 PM IST
కాళ్లు పట్టుకుంటా అంటూ వెక్కివెక్కి ఏడ్చిన కమెడియన్..
వడివేలు కమెడియన్ (vadivelu comedian)
  • Share this:
కరోనా వైరస్ ఇప్పుడు ఎంత తిప్పలు పెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాధితులు పడుతున్న నరకయాతన చూస్తుంటే అర్థమైపోతుంది. ఈ మహమ్మారి రోజురోజుకూ ఉధృతం అవుతుంది. దాంతో అంతా భయంతో చచ్చిపోతున్నారు. కొందరు ఆకలితో చచ్చిపోతున్నారు.. ఎలాగైనా కూడా దీన్ని అంతమొందించాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు కానీ అది మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ మహమ్మారి తీవ్రతను చూసి ఓ కమెడియన్ వెక్కివెక్కి ఏడ్చేసాడు. మీ కాళ్లు పట్టుకుంటాను ఇంట్లోంచి బయటికి రాకండి అంటూ వేడుకుంటున్నాడు.
వడివేలు కమెడియన్ (vadivelu comedian)
వడివేలు కమెడియన్ (vadivelu comedian)

ఆయనే తమిళ స్టార్ కమెడియన్ వడివేలు. ఈ మధ్య ఎక్కువగా వివాదాలతో వార్తల్లో ఉంటున్న ఈయన.. ఇప్పుడు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చాడు. తాజాగా ఈయన ఓ వీడియో విడుదల చేసాడు. అందులో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు వడివేలు. ఏడుస్తూ ప్రజలను వేడుకుంటున్నాడు ఈయన. మన జీవితంలో ఇలాంటి ఓ రోజు వస్తుందని ఊహించలేదని.. ఇది చూసి తాను రోజూ ఏడుస్తున్నట్లు చెప్పాడు.


పోలీసులు, వైద్యులు మన కోసమే ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తున్నారు.. మీరు దయచేసి రోడ్ల మీద తిరగొద్దు అని చేతులు జోడించి వేడుకుంటున్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు చెప్పింది విని.. ఇంటిపట్టునే ఉండండంటున్నాడు వడివేలు. మొత్తానికి ఈయన వీడియో ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది.

First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading