అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధించిన సింగర్ అరెస్ట్..

తమిళనాడుకు చెందని ప్రముఖ సింగర్ ధరణి.. గత కొన్ని రోజులుగా తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుపై పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

news18-telugu
Updated: November 29, 2019, 8:59 AM IST
అక్రమ సంబంధం పెట్టుకొని భార్యను వేధించిన సింగర్ అరెస్ట్..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడుకు చెందని ప్రముఖ సింగర్ ధరణి.. గత కొన్ని రోజులుగా తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదుపై పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సింగర్ ధరణి విషయానికొస్తే.. తమిళంలో ప్రముక సింగర్‌ పజని కుమారుడైన ఇతడు కూడా గాయకుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. ఇతడు కొన్నేళ్ల క్రితం తన స్నేహితురాలైన విజయభానును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు వివాహా సమయంలో అత్తవారింటి నుంచి బోలెడు కట్నకానుకలు తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో పెళ్లైన కొన్నేళ్ల వరకు బాగానే ఉన్న ధరణి.. ఆ తర్వాత తన అసలు స్వరూపం బయటపెట్టాడు. నిత్యం తన భార్యను అదనపు కట్నం కోసం వేధిస్తూ.. శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగి వేసారిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. భార్యను వేధింపులకు గురిచేస్తున్నట్టు కేసు నమోదు చేసిన పోలీసులు ధరణితో పాటు కుటుంబ సభ్యలను కూడా అరెస్ట్ చేసారు. ఈ కేసులో ధరణి అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపించబడిని మహిళను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

First published: November 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు