ప్రపంచ రికార్డు పై కన్నేసిన విక్రమ్.. కమల్ హాసన్‌ను టార్గెట్ చేసిన అపరిచితుడు..

Vikram | స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే ప్రేక్షకులు.. అదే హీరో రెండు పాత్రల్లో నటిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇపుడు విక్రమ్ కూడా ఇదే చేయబోతున్నాడు.

news18-telugu
Updated: August 2, 2019, 1:00 PM IST
ప్రపంచ రికార్డు పై కన్నేసిన విక్రమ్.. కమల్ హాసన్‌ను టార్గెట్ చేసిన అపరిచితుడు..
25 గెటప్స్‌లో చియాన్ విక్రమ్ (ట్విట్టర్ ఫోటో)
news18-telugu
Updated: August 2, 2019, 1:00 PM IST
స్క్రీన్ మీద ఒక్క హీరోను చూస్తేనే ఖుషీ అయ్యే ప్రేక్షకులు.. అదే హీరో రెండు పాత్రల్లో నటిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇపుడు విక్రమ్ కూడా ఇదే చేయబోతున్నాడు. కానీ ఆయన చేయబోతున్నది రెండు లేదా మూడు పాత్రలు కాదు. ఏకంగా 25 పాత్రలు చేయబోతున్నాడు. అప్పట్లో ఎన్టీఆర్, శివాజీ గణేషణ్,సంజీవ్ కుకమార్ ‘నవరాత్రి’ సినిమాలో తొమ్మిది పాత్రల్లో నటించి రికార్డు క్రియేట్ చేసారు. ఆ తర్వాత కమల్ హాసన్..‘దశావతారం’లో ఏకంగా పది పాత్రలు పోషించి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ప్రియాంక చోప్రా కూడా ‘వాట్స్ యువర్ రాశీ’ సినిమాలో ఏకంగా 12 పాత్రలతో ఇప్పటి వరకు టాప్ ప్లేస్‌లో ఉంది. తాజాగా విక్రమ్ ..అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కబోయే 58వ సినిమాలో 25 విభిన్న గెటప్‌లతో కనిపించనున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే విక్రమ్‌ గెటప్‌కు సంబంధించిన హాలీవుడ్ టెక్నీషియన్స్‌ను తెప్పించినట్టు సమాచారం. ఈ సినిమాలో విక్రమ్ 25 పాత్రల్లో నటిస్తాడా లేకపోతే.. 25 విభిన్న గెటప్స్‌లో కనిపిస్తాడా అనే దానిపై క్లారిటీ లేదు. ఒకవేళ నిజంగా 25 పాత్రలు చేస్తే.. అందులో ముఖ్యమైన పాత్రలన్నింటిలోను విక్రమ్ కనిపించడం ఖాయం. ఒక రకంగా విక్రమ్ ఈసినిమాతో ప్రపంచ రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అని చెప్పొచ్చు.

tamil senior top hero chiyaan vikram to play 25 roles in his next film,chiyaan vikram,vikram,chiyaan,chiyaan vikram to play 25 roles in his next film,vikram twitter,vikram instagram,kamal haasan play 10 roles in dashavatharam,vikram movies,vikram to team up with anand shankar,vikram hit movies,vikram old movies,vikram all movies,vikram tamil movie,vikram full movies,list of vikram movies,vikram comedy scenes,vikram in vijay awards,vikram all movies list,vikram movie list,vikram full movies list,vikram films,vikram movie,actor vikram films,vikram movies list,vikram new movie trailer,i vikram,kollywood,tollywood,విక్రమ్,25 పాత్రల్లో విక్రమ్,విక్రమ్ కమల్ హాసన్,విక్రమ్ ప్రపంచ రికార్డు,విక్రమ్ 25 పాత్రలు,విక్రమ్ 25 గెటప్స్,విక్రమ్ వరల్డ్ రికార్డు,
కమల్ దశావతారం


ఈ సినిమాను 7 స్క్రీన్ స్టూడియోస్,వయకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాను ఒకేసారి తమిళం,తెలుగు,హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నారు. ఈసినిమా కోసం చిత్ర పరిశ్రమలోని ప్రముఖ టెక్నిషియన్స్ అందరు పనిచేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను వచ్చే యేడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. త్వరలనే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

First published: August 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...