• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TAMIL SENIOR ACTOR KARTHIK HOSPITALIZED AGAIN AND HIS HEALTH CONDITION CRITICAL NOW PK

Tamil actor Karthik: ‘సీతాకోకచిలక’ హీరో కార్తిక్ ఆరోగ్యం విషమం.. ఎమర్జెన్సీలో సీనియర్ నటుడు..

Tamil actor Karthik: ‘సీతాకోకచిలక’ హీరో కార్తిక్ ఆరోగ్యం విషమం.. ఎమర్జెన్సీలో సీనియర్ నటుడు..

తమిళ హీరో కార్తీక్ (Actor Kathik)

Tamil actor Karthik: ఇండస్ట్రీకి మంచి టైమ్ ఇంకా రాలేదు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. తాజాగా తమిళ సీనియర్ నటుడు కార్తీక్ (Actor Karthik) ఆరోగ్యం విషమంగా మారిందనే వార్తలు వస్తున్నాయి. సీతాకోకచిలక సహా తెలుగులో చాలా సినిమాలు చేసాడు ఈయన.

  • Share this:
పేరుకు తమిళ నటుడు అయినా కూడా తెలుగులో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కార్తీక్. ఈయన తెలుగులోనూ చాలా సినిమాలు చేసాడు. సీతాకోకచిలక లాంటి సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం రేపాడు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు కార్తీక్. ఈ మధ్యే తీవ్ర అనారోగ్యంతో బాధ పడిన కార్తీక్.. కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండి కోలుకున్నాడు. విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన తర్వాత కూడా ఈయన మళ్లీ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. దాంతో అక్కడ మళ్లీ ఆయనకు అనారోగ్యం తిరగబెట్టింది. ఈ మధ్యే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడిఎంకే పార్టీకి ప్రచారం కూడా చేసాడు. ఇదిలా ఉంటే నటుడిగా బిజీగా ఉన్న సమయంలోనే అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చాడు కార్తీక్. సొంతంగా పార్టీ కూడా పెట్టాడు. కానీ అనారోగ్య కారణాలతో ఆ పార్టీని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు కార్తీక్. మొన్నటి తమిళనాడు ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరఫున ప్రచారం చేసాడు.

ఈ ప్రచార సమయంలోనే శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడ్డాడు. వెంటనే ఈయనకు కరోనా టెస్టులు చేసారు కానీ నెగిటివ్ అని వచ్చింది. మార్చ్ 21న ఈయన హాస్పిటల్‌లో చేరి మళ్లీ డిశ్చార్జ్ అయ్యాడు. తాజాగా కార్తీక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతుంది.. ఈయనకు బీపీ కూడా ఎక్కువైనట్లు వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఈయన హాస్పిటల్‌లోనే ఉన్నాడు.
tamil actor karthik health condition,actor karthik hospitalized after sudden illness,actor karthik hospitalized,karthik hospitalized after sudden illness,senior actor karthik,actor karthik hospitalised,karthik hospital news,తమిళ నటుడు కార్తీక్,కార్తీక్ ఆరోగ్యం విషమం,విషమంగా సీతాకోకచిలక హీరో కార్తీక్ ఆరోగ్యం
తమిళ హీరో కార్తీక్ (Actor Kathik)

కార్తీక్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారు. ప్రస్తుతం ఈయనకు ఎమర్జెన్సీలో చికిత్స అందిస్తున్నారు. ఈయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులోనూ చాలా సినిమాలు చేసాడు కార్తీక్. ఇక్కడ సీతాకోకచిలక తర్వాత అన్వేషన, మగరాయుడు, అభినందన, అనుబంధం, పుణ్య స్త్రీ లాంటి సినిమాల్లో నటించాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఓం 3డి సినిమాలో విలన్‌గా నటించాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు