Nayanthara : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్‌లో ఒకరుగా వెలుగుతోంది నయనతార. ఈ భామ ఓ పక్క స్టార్ హీరోల సినిమాలలో చేస్తూనే, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ అదరగొడుతోంది. మొదట్లో గ్లామర్ ఒలకబోసిన నయన్.. ఆ తర్వాత కొంత కుదురుకున్నాక మహిళా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్గా భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న నయనతార మిగతా ఖర్చుల విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందట. ఇప్పుడు ఈ విషయం తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది. నయనతార ఖర్చులతో పాటు, అరడజనుకు పైగా ఉండే ఆమె వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలు భరించాల్సివస్తుందట. దీని కారణంగా నయనతార సిబ్బంది కోసమే రోజుకు ఓ లక్ష రూపాయల వరకు నిర్మాతలకు ఖర్చు అవుతుందని సమాచారం. దీనికి తోడు హోటల్స్, ఫుడ్, ట్రావెల్ ఖర్చులు ఇలా తడిసిమోపెడు అవుతున్నాయని నిర్మాతలు వాపోతున్నారు.
నయనతార Photo : Twitter
ఇదే విషయాన్ని ప్రముఖ తమిళ నిర్మాత కె.రాజన్ (Rajan) ఆ మధ్య మీడియాతో మాట్లాడుతూ.. నయనతార అసిస్టెంట్స్ జీతాలు కూడా నిర్మాతే భరించాల్సి వస్తుందని పేర్కొన్నారు. తీస్తున్న సినిమా హిట్ అవుతుందో లేదా పట్ అవుతుందో అని నిత్యం టెన్షన్ పడుతూ కుయ్యో మొర్రో అంటున్న నిర్మాతకు ఈ అదనపు ఖర్చులు 'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు' ఉందని.. దీనితో నయనతారకు తమిళ నిర్మాతలందరూ కలిసి చెక్ పెట్టే పనిలో ఉన్నారట. అగ్రిమెంట్ సమయంలోనే కేవలం అవసరమైన సిబ్బందికి మినహా మిగతా వారికి ఖర్చులు చెల్లించబోమని చెప్పాలని లేని పక్షములో ఆమెకు అవకాశాలు ఇవ్వకూడని నిర్ణయించుకున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌తో 168వ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కిస్తున్నాడు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.