హోమ్ /వార్తలు /సినిమా /

Tamil Producers Council: ఆరేళ్లుగా విడుదల కాని సినిమాలపై తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం..

Tamil Producers Council: ఆరేళ్లుగా విడుదల కాని సినిమాలపై తమిళ నిర్మాతల మండలి కీలక నిర్ణయం..

Tamil Producers Council: తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (Tamil Producers Council) సంచలన నిర్ణయం తీసుకుంది. గత 2015 నుంచి 2021 మధ్యకాలంలో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదల కాని సినిమాల వివరాలను సేకరిస్తోంది. ఇన్నేళ్లుగా విడుదలవ్వని చిత్రాల వివరాలను.. ఆయా నిర్మాతలు జూన్ 28 లోపు సమర్పించాల్సిందిగా కోరింది.

ఇంకా చదవండి ...

తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా కొన్ని వందల సినిమాలు అన్ని ఇండస్ట్రీలలో విడుదల కాకుండా ఆగిపోయాయి. అయితే అంతకంటే ముందు నుంచి కూడా కొన్ని సినిమాలు అనివార్య కారణాలతో విడుదలకు నోచుకోలేదు. అలా ఒక్కటి రెండు కాదు.. వందల సినిమాలు ల్యాబుల్లోని బాక్సుల్లోనే మగ్గిపోతున్నాయి. ఇలాంటి సినిమాల కోసం ఇప్పుడు తమిళ నిర్మాతల మండలి అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత 2015 నుంచి 2021 మధ్యకాలంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు నోచుకోని సినిమాల వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు ఆయా చిత్రాల నిర్మాతలకు ఓ విజ్ఞప్తి చేసింది. ఇన్నేళ్లుగా విడుదలకు నోచుకోలేని చిత్రాల వివరాలను.. ఆయా నిర్మాతలు జూన్ 28 లోపు నిర్మాతల మండలికి సమర్పించాల్సిందిగా కోరింది. 2015-2021 మధ్య కాలంలో నిర్మించి, విడుదల కాని సినిమాలు.. అలాగే డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు అమ్మని సినిమాలు.. థియేటర్‌లో విడుదల చేయలేకపోయిన చిత్రాలు.. నిర్మాణం పూర్తి చేసుకుని ఏదో ఒక సంస్థకు హక్కులు కేటాయించినప్పటికీ ఆ వివరాలు.. ఇలా ఒక్కటేంటి అన్నీ వెల్లడించాలని కోరింది.

దాంతో పాటు ఆ విడుదల కాని సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు, ఆ చిత్రం ప్రస్తుతం ఏ ల్యాబ్‌లో ఉంది సంబంధిత వివరాలు పొందు పరచాలని తెలిపింది. ఆ చిత్రంలో ఏదేని సమస్య ఉన్నట్టయితే ఆ సమస్య ఏంటి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా నిర్మాతల మండలి ముందుంచాని కోరింది. ఈ వివరాలన్నీ సంబంధిత చిత్ర నిర్మాణ సంస్థ లెటర్‌హెడ్‌పై లిఖితపూర్వకంగా రాసివ్వాలని కోరింది.

Tamil Producers Council,Tamil Producers Council starting ott,Tamil Producers Council wants unreleased movies list,Tamil Producers Council decision,vishal Tamil Producers Council,తమిళ నిర్మాతల మండలి,విడుదల కాని సినిమాలపై తమిళ నిర్మాతల మండలి అనూహ్య నిర్ణయం
తమిళ నిర్మాతల మండలి (tamil producers council)

ఇదంతా ఎందుకు అనే అనుమానాలు రావచ్చు. ఎందుకంటే త్వరలోనే తమిళ చిత్ర నిర్మాతల మండలి ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫాం మొదలు పెట్టనుంది. థియేటర్స్‌లో అనేక కారణాలతో విడుదలకు నోచుకోని సినిమాలను ఈ వేదికగా విడుదల చేయాలని చూస్తున్నారు నిర్మాతల మండలి. అలాగైనా కొందరు నిర్మాతలకు లాభం చేకూరినట్లు అవుతుంది కదా.. అదే తమిళ నిర్మాతల మండలి ప్లాన్. ఇది వర్కవుట్ అయితే నిజంగానే ఎంతోమంది నిర్మాతల తల మీద భారం దించేసినట్లే అవుతుంది.

First published:

Tags: Kollywood, Tamil Cinema

ఉత్తమ కథలు