హోమ్ /వార్తలు /సినిమా /

Shankar - V Ravichandran: శంకర్‌కు షాక్.. ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌కు ఆదిలోనే హంసపాదు..

Shankar - V Ravichandran: శంకర్‌కు షాక్.. ‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌కు ఆదిలోనే హంసపాదు..

పైగా శంకర్ కూడా ఎప్పుడూ తెలుగు ఇండస్ట్రీకి రాలేదు. కానీ ఇన్నేళ్ళకు ఆ అవకాశం వచ్చింది. తండ్రికి ఛాన్స్ దక్కకపోయినా తనయుడికి మాత్రం శంకర్‌తో సినిమా చేసే ఆఫర్ వచ్చేసింది. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియన్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు శంకర్.

పైగా శంకర్ కూడా ఎప్పుడూ తెలుగు ఇండస్ట్రీకి రాలేదు. కానీ ఇన్నేళ్ళకు ఆ అవకాశం వచ్చింది. తండ్రికి ఛాన్స్ దక్కకపోయినా తనయుడికి మాత్రం శంకర్‌తో సినిమా చేసే ఆఫర్ వచ్చేసింది. రామ్ చరణ్ హీరోగా పాన్ ఇండియన్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు శంకర్.

Shankar - V Ravichandran: కమల్ హాసన్(Kamal Haasan) భారతీయుడు 2(Indian 2) సినిమాను మధ్యలోనే వదిలేసిన శంకర్.. ఈ మధ్యే రామ్ చరణ్(Ram Charan) సినిమాకు కమిటయ్యాడు. ఇదిలా ఉండగానే తాజాగా హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా అన్నియన్(Anniyan) సినిమాను రీమేక్ చేయాలని ముందుకొచ్చాడు.

ఇంకా చదవండి ...

ఇప్పుడు ఎవర్ని అని మాత్రం ఏం లాభం..? అసలు శంకర్ టైమే బాగోలేదంతే. ఆయనేం చేసినా ఒకప్పుడు మిడాస్ టచ్‌లా బంగారం అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం కాలం కలిసిరావడం లేదు. అందుకే తాడే పామై ఆయన్ని కాటేస్తుంది. చేస్తున్న సినిమాలు ప్రేక్షకులకు నచ్చడం లేదు.. చేయాల్సిన సినిమాలు మధ్యలోనే అటకెక్కుతున్నాయి.. చేయబోయే సినిమాలకు ఆదిలోనే ఆటంకాలు వస్తున్నాయి. అసలు శంకర్ టైమ్ ఏంటో ఆయనకే అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటంటే.. కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాను మధ్యలోనే వదిలేసిన ఈయన.. ఈ మధ్యే రామ్ చరణ్ సినిమాకు కమిటయ్యాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇదిలా ఉండగానే తాజాగా హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా అన్నియన్ సినిమాను రీమేక్ చేయాలని ముందుకొచ్చాడు. ఈ సినిమా అపరిచితుడుగా తెలుగులోనూ సంచలన విజయం సాధించింది. విక్రమ్ అప్పట్నుంచే తెలుగులో కూడా స్టార్ అయిపోయాడు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు లీగల్ ఇబ్బందులు వచ్చేలా కనిపిస్తున్నాయి. అన్నియన్ నిర్మాత రవిచంద్రన్ ఈ రీమేక్ విషయంలో సంతృప్తిగా లేడు.

తన అనుమతులు లేకుండా సినిమాను హిందీలో ఎలా రీమేక్ చేస్తారు.. అలా చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానంటూ ప్రెస్ నోట్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒరిజినల్ వెర్షన్ అన్నియన్ (తెలుగులో అపరిచితుడు) కథ తనకు సొంతం అని నిర్మాత రవిచంద్రన్ చెప్తున్నాడు. ఈ కథ రాసిన రైటర్ సుజాత (దివంగత రంగరాజన్) తనకు పూర్తి హక్కులు ఇచ్చాడని.. దానికి సంబంధించి ఆయనకు డబ్బులు కూడా పే చేసానని చెప్పుకొచ్చాడు ఈయన.

Shankar,Shankar twitter,Shankar anniyan hindi remake ranveer singh,Shankar V Ravichandran anniyan producer,anniyan producer V Ravichandran sends legal notice to shankar,telugu cinema,శంకర్,శంకర్‌కు లీగల్ నోటీస్ పంపిన ఆస్కార్ వి రవిచంద్రన్,శంకర్ అన్నియన్ రీమేక్
శంకర్‌కు లీగల్ నోటీసు (Shankar Anniyan remake)

అలాంటి సమయంలో తనకు తెలియకుండా శంకర్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి ముందుకు రావడం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పాడు. ఇంత జరిగిన తర్వాత కూడా తన కథను బాలీవుడ్‌లో రీమేక్ చేయాలనుకుంటే మాత్రం కచ్చితంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు రవిచంద్రన్. అయితే ఈ ప్రెస్ నోట్ అధికారికంగా విడుదల చేసారా అనేది మాత్రం అర్థం కావడం లేదు. దీనిపై సమాచారం రావాల్సి ఉంది. ఒకవేళ నిజమే అయితే మాత్రం కచ్చితంగా శంకర్‌కు అంతకంటే షాక్ ఉండదు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Kollywood, Shankar, Tamil Cinema

ఉత్తమ కథలు