హోమ్ /వార్తలు /సినిమా /

సూర్యకు తమిళ థియేటర్స్ యజమానుల సంఘం వార్నింగ్..

సూర్యకు తమిళ థియేటర్స్ యజమానుల సంఘం వార్నింగ్..

సూర్య Photo : Twitter

సూర్య Photo : Twitter

Suriya: సూర్యకు అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఈయన ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటే నిర్మాతగానూ బిజీగా ఉన్నాడు సూర్య. నచ్చిన కథలను..

సూర్యకు అనుకోని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ఈయన ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటే నిర్మాతగానూ బిజీగా ఉన్నాడు సూర్య. నచ్చిన కథలను తన 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో సినిమాలు నిర్మిస్తుంటాడు సూర్య. ఇలాంటి సమయంలో భవిష్యత్తులో ఈయన నిర్మించే ఏ సినిమాను కూడా థియేటర్‌లో విడుదల చేయకూడదని తమిళ థియేటర్‌ యజమానుల సంఘం నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారుతుంది. అసలు విషయం ఏంటంటే తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో సూర్య నిర్మించిన పోన్ మగల్ వందల్‌ సినిమా ఈ పాటికే విడుదల కావాల్సి ఉంది.

జ్యోతిక కొత్త చిత్రం (ponmagal vandhal)
జ్యోతిక కొత్త చిత్రం (ponmagal vandhal)

అయితే లాక్‌డౌన్ కారణంగా విడుదలకు నోచుకోకపోవడంతో నేరుగా దీన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు చెప్పారు. మే తొలివారంలో అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా వస్తుందని ప్రకటించారు. ఈ నిర్ణయం తమిళనాడు థియేటర్‌ యజమానులకు అస్సలు నచ్చలేదు. వాళ్లు సూర్య నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ సినిమా అయినా కూడా ముందు థియేటర్‌లో విడుదలైన తర్వాత ఓటిటిలో రావాలి.. కానీ ఇప్పుడు సూర్య మాత్రం తాను నిర్మించిన పోన్ మగల్ వందల్‌ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యామంటున్నారు వాళ్లు.

సూర్య జ్యోతిక (suriya jyothika)
సూర్య జ్యోతిక (suriya jyothika)

నిర్మాతల్ని కలిసి మాట్లాడినా కూడా వాళ్లు తమ మాట వినలేదని.. అందుకే ఇకపై వాళ్ల బ్యానర్‌పై నిర్మించే సినిమాలను థియేటర్‌లో ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నామని తమిళనాడు థియేటర్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్‌ సెల్వన్‌ మీడియాతో చెప్పారు. పోన్ మగల్ వందల్‌ సినిమాలో లాయర్ పాత్రలో నటించింది జ్యోతిక. ఈ సినిమాను జేజే ఫ్రెడ్రిక్‌ తెరకెక్కించాడు. సీనియర్ నటులు భాగ్యరాజ్‌, పాండియరాజన్‌, ప్రతాప్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలిక.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Suriya, Tamil Cinema, Telugu Cinema

ఉత్తమ కథలు