హీరో విజయ్ ఫైనాన్షియర్ ఇంట్లో 65 కోట్లు.. ఆరా తీస్తున్న ఐటి అధికారులు..

తమిళ స్టార్ హీరో విజయ్‌ నివాసాల్లో ఇన్‌కం టాక్స్ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహస్తున్నారు. ఈ సోదాల్లో దాదాపు రూ.65 కోట్లు దొరికాయి. ఈ డబ్బులకు సంబంధించి హీరో విజయ్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

news18-telugu
Updated: February 6, 2020, 3:44 PM IST
హీరో విజయ్ ఫైనాన్షియర్ ఇంట్లో 65 కోట్లు.. ఆరా తీస్తున్న ఐటి అధికారులు..
విజయ్ ఇ:ట్లో నోట్ల కట్టలు (ANI/Source)
  • Share this:
తమిళ స్టార్ హీరో విజయ్‌ నివాసాల్లో ఇన్‌కం టాక్స్ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహస్తున్నారు. ఆల్రెడీ నిన్న( బుధవారం )పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. తన కొత్త చిత్రం మాస్టర్‌ షూటింగ్ కోసం నైవేలిలో ఉన్న విజయ్‌ని చెన్నైకి పిలిపించారు ఐటీ అధికారులు. గతేడాది అక్టోబరులో రిలీజైన బిగిల్‌ సినిమాకి తీసుకున్న రెమ్యునరేషన్‌పై విజయ్ ‌ను ప్రశ్నించారు ఐటీ అధికారులు. ఈ సినిమా నిర్మాణ సంస్థ ఏజీఎస్‌ ఆఫీసుల్లోనూ తనిఖీలు జరిగాయి. ఇవాళ ఉదయమే విజయ్ ఇంటికి చేరుకున్న అధికారులు... మొత్తంగా 38 చోట్ల పోదాలు నిర్వహించి  రూ.65 కోట్ల నోట్ల కట్టను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బులకు సంబంధించి ఐటీ అధికారులు విజయ్‌ను ఏడెనిమిది గంటలుగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బిగిల్ సినిమాకు ముందు తీసుకున్న పారితోషకానికి సంబంధించి రకరకాల ప్రశ్నలు వేస్తున్నట్లు తెలిసింది. ఐతే... విజయ్ అభిమానులు మాత్రం... కేంద్రంలో ఉన్న బీజేపీయే కావాలని ఈ సోదాలు చేయిస్తోందని మండిపడుతున్నారు.

Tamil Nadu Income Tax Department is conducting raids & surveys at the properties of Tamil actor Vijay and Rs 65 crores have been recovered,it officers, vijay, chennai, it raids, chennai houses, tamil industry, kollywood, తమిళనాడు, హీరో విజయ్, ఐటీ సోదాలు,
విజయ్ ఇంట్లో నోట్ల కట్టలు (ANI/Source)


ఉదయమే చెన్నైలోని విజయ్ ఇంటికి వచ్చి... ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు సినిమాల్లో ఎన్నో నీతులు చెప్పే విజయ్.. తాను తప్పుచేయకపోతే ఎందుకు భయపడతున్నారు. ఇంటికి వచ్చిన ఐటీ అధికారులకు సహకరిస్తే బాగుంటుందని వేరే హీరో అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో సైతం విజయ్ కు చెందిన సినీ నిర్మాణ సంస్థలపై ఐటీ శాఖ ఇదే తరహాలో రెయిడ్స్ జరిపింది.

First published: February 6, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు