హోమ్ /వార్తలు /సినిమా /

షూటింగ్స్‌కు అనుమతి.. 60 మందితో చేసుకోవచ్చన్న ప్రభుత్వం..

షూటింగ్స్‌కు అనుమతి.. 60 మందితో చేసుకోవచ్చన్న ప్రభుత్వం..

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter

ప్రతీకాత్మక చిత్రం Photo : Twitter

కరోనా మహమ్మారిని కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా ముఖ్యంగా రోజువారి పనులు చేస్తూ పొట్టనింపుకునే కార్మికులు తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్నారు. తినడానికి తిండిలేక చేద్దాం అంటే పనిలేక తీవ్ర అవస్థలు పడ్డారు. అయితే తాజాగా లాక్ డౌన్ 5.0లో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. కొన్ని షరతులతో దాదాపు అన్ని పరిశ్రమల్నీ ఓపెన్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే సినీ పరిశ్రమకు అనుమతులు మాత్రం పూర్తిగా రాలేదు. మరోవైపు జూన్ 8నుండి షాపింగ్ మాల్స్‌కు అనుమతిని ఇచ్చిన సినిమా హాల్స్‌కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో కొన్ని అధికారాలతో రాష్ట్ర ప్రభుత్వాలు కొద్ది మందితో షూటింగ్‌లకు అనుమతిని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ ముఖ్య మంత్రిని కలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దానికి సంబందించిన గైడ్ లైన్స్‌ను రూపోందించే పనిలో ఉన్నారు అధికారులు. కాగా తాజాగా లాక్‌డౌన్‌తో మూతబడిన తమిళనాడు టీవీ పరిశ్రమ మళ్లీ తెరుచుకోబోతున్నట్లు సమాచారం. అక్కడి ప్రభుత్వంల టీవీ సీరియళ్ల షూటింగ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షూటింగ్‌లో గరిష్టంగా 20 మందితో షూటింగ్ జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, అంత కొద్దిమందితో షూటింగ్ సాధ్యం కాదని, కనీసం 60 మందితో కూడిన షూటింగులకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, టీవీ నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. అయితే వారి విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం శనివారం షూటింగ్ జరుపుకోవచ్చంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ చిన్న కండీషన్ పెట్టింది. షూటింగ్ నిర్వహించే ప్రదేశాల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తీసుకోవాలనీ ప్రభుత్వం పేర్కొంది.

First published:

Tags: Tamil Film News, Tollywood Movie News

ఉత్తమ కథలు