TAMIL NADU BJP YOUTH WING GIVES WARNING TO STAR HERO SURIYA ABOUT NEET ISSUE PK
Suriya Vs BJP: తమిళ స్టార్ హీరో సూర్యకు వార్నింగ్ ఇచ్చిన BJP నేతలు..
హీరో సూర్య (Hero Suriya)
Suriya Vs BJP: తమిళ స్టార్ హీరో సూర్య(Suriya) మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టాడు. దాంతో ఆయన్ని బిజేపీ కూడా తప్పు పట్టింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మండిపడ్డారు బిజేపీ తమిళనాడు యువజన సంఘం.
తమిళ స్టార్ హీరో సూర్య మరోసారి కేంద్ర ప్రభుత్వ తీరును తప్పు బట్టాడు. దాంతో ఆయన్ని బిజేపీ కూడా తప్పు పట్టింది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ మండిపడ్డారు బిజేపీ తమిళనాడు యువజన సంఘం. ప్రస్తుతం ఈ వ్యవహారం చాలా వేడిగా ఉంది. ఇప్పుడు కాదు చాలా రోజులుగా సూర్య, బిజేపీ మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మరోసారి ఇదే జరుగుతుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై తమిళ సినీ ప్రముఖులు చాలా మంది తమ అభిప్రాయాలను తెలియజేసారు. అందులో సూర్య కాస్త సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. దాంతో తమిళనాడు బిజేపీ నాయకులు సూర్యపై ఫైర్ అవుతున్నారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడం అంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనని సూర్య అభిప్రాయపడ్డాడు. ఎక్కడైనా భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటం కోసమే చట్టాలు చేయాలి కానీ ఉన్న స్వేచ్ఛను నాశనం చేయడానికి కాదంటూ కామెంట్ చేసాడు సూర్య. దీనిపై తమిళనాడు బీజేపీ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.
సూర్య కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆయనపై మండి పడ్డారు. తమిళనాడు బీజేపీ యువజన విభాగం కార్యదర్శి వినోద్ సెల్వం మాట్లాడుతూ సూర్యను సినిమాలు మాత్రమే చేసుకోవాలని.. కాదని అనవసర విషయాల్లో వేలు పెడితే మర్యాదగా ఉండదని హెచ్చరించాడు. తమిళనాడులో బీజేపీ పార్టీకి సినీ హీరోలకు మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. గతంలో స్టార్ హీరోలు విజయ్, అజిత్ కూడా బిజేపీతో గొడవ పడ్డ సందర్భాలున్నాయి. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం ఓ సమావేశం నిర్వహించింది. రాబోయే రోజుల్లో అమలు చేయాల్సిన ఏడు తీర్మానాల గురించి అందులో చర్చించింది.
సూర్య (Suriya)
వాటిలో ఒకటి నీట్.. ఈ విషయంలో నటుడు సూర్య కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టాడు. గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నీట్ విధానం తమిళనాడులోని పేద విద్యార్థులకు శాపంగా మారుతోందని కామెంట్స్ చేశాడు సూర్య. అప్పుడు సూర్య చేసిన కామెంట్స్నే ఇప్పుడు బీజేపీ ఖండిస్తూ తీర్మానం చేసింది. సూర్య నీట్ ఎంపిక గురించి ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని.. తన సొంత ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వ విధానాలను తప్పుబడుతున్నారని విమర్శించారు. దాంతో పాటు సినిమాటోగ్రఫీ చట్టంపై కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఈయనపై మండిపడింది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.