Home /News /movies /

TAMIL NADU ASSEMBLY ELECTIONS 2021 KOLLYWOOD STAR HERO VIJAY WHO CAME ON A BICYCLE AND VOTED TA

Tamil Nadu Assembly Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వెరైటీగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న హీరో విజయ్..

ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో విజయ్ (Twitter/Photo)

ఓటు హక్కు వినియోగించుకున్న స్టార్ హీరో విజయ్ (Twitter/Photo)

Tamil Nadu Assembly Elections 2021:  దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఎన్నికల్లో హీరో విజయ్ వెరైటీ వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు.

ఇంకా చదవండి ...
    Tamil Nadu Assembly Elections 2021:  దేశవ్యాప్తంగా ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా అన్నాడీఎంకే, డీఎంకే కూటమిల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉంది. మరోవైపు కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళలో ముఖ్యంగా ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటమిల మధ్య పోటీ ఉంది. ఈ సారి అక్కడ బీజేపీ గట్టి పోటీ ఇవ్వనున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఇక అస్సాంలో ఈ సారి మూడో విడత ఎన్నికలతో అక్కడ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

    ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఓటు వేయడానికి సామాన్యులతో పాటు రజినీకాంత్, కమల్ హాసన్, అజిత్ వంటి సినీ ప్రముఖులు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతేకాదు అభిమానులకు ఓటు వేయమని పిలుపునిచ్చారు. మరోవైపు తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ ఓటు హక్కను వినియోగించుకున్నారు.

    ఓటు వేసేందుకు సైకిల్ పై వచ్చిన హీరో విజయ్ (Twitter/Photo)


    అంతేకాదు విజయ్ తన ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్ వచ్చి ఓటు వేసారు. ఓల్డ్ మహాబలిపురం రోడ్డు, నీలాంకరైలో ఉండే హీరో విజయ్.. స్థానికంగా ఉండే పోలింగ్ కేంద్రంలో ఓటు వేసారు.ఈ సందర్భంగా విజయ్ చూసేందకు అభిమానులు పోటెత్తారు.

    అంతేకాదు తన అభిమానులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వచ్చి అందరినీ ఆశ్యర్యపరిచాడు. మరోవైపు హీరోలు సూర్య, కార్తిలు తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: 5 State Elections, Kollywood, Tamil Nadu Assembly Elections 2021, Vijay

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు