‘సాహో’ కొంప ముంచేస్తున్న తమిళ మీడియా.. బుజ్జగిస్తున్న నిర్మాతలు..

కష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు సాహో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్. మరో 10 రోజుల్లో సినిమా విడుదల కానుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 17, 2019, 8:17 AM IST
‘సాహో’ కొంప ముంచేస్తున్న తమిళ మీడియా.. బుజ్జగిస్తున్న నిర్మాతలు..
సాహో ప్రెస్ మీట్‌లో ప్రభాస్
  • Share this:
కష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు సాహో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్. మరో 10 రోజుల్లో సినిమా విడుదల కానుంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ సినిమాకు మీడియా నుంచి ఊహించని రియాక్షన్ వచ్చింది. అసలే ఇలాంటి పెద్ద సినిమాలకు మీడియా ప్రతినిథిగా ఉండాలి.. వాళ్లేం చేసినా కూడా ప్రేక్షకులకు చూపించే మాధ్యమమే మీడియా. అలాంటి మీడియా వాళ్లే ఇప్పుడు సాహో సినిమాపై కినుక వహించారు. ఇది జరిగింది తెలుగులో కాదు తమిళనాట.
Tamil media not supporting Saaho movie and Issues between Journalists Producers are in high pk కష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు సాహో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్. మరో 10 రోజుల్లో సినిమా విడుదల కానుంది. saaho,saaho movie pre release event,saaho movie pre release event passes,saaho movie pre release event RFC,saaho movie twitter,saaho movie instagram,saaho movie media,saaho tamil media,saaho producers,saaho movie updates,prabhas twitter,prabhas shraddha kapoor,ప్రభాస్,సాహో,సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్,సాహో మీడియా,సాహో తమిళ మీడియా,తెలుగు సినిమా
‘సాహో’ ట్రైలర్ (ట్విట్టర్ ఫోటో)

అక్కడ కొన్ని రోజులుగా నిర్మాతలకు, జర్నలిస్టులకు మధ్య యుద్ధం జరుగుతుంది. జర్నలిస్టులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని వాళ్ల వాదన. దాంతో తమ సత్తా చూపిస్తామంటూ ఒకరినొకరు కత్తులు దూసుకుంటున్నారు. ఈ సమయంలోనే సాహో ప్రెస్ మీట్ చెన్నైలో ఏర్పాటు చేసారు. దీనికి మీడియా నుంచి సరైన సహకారం అందడం లేదు. సినిమా రిలీజ్ సమయంలో ఇలాంటి కష్టం రావడంతో సాహో యూనిట్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. కేవలం ఈ విషయాన్ని పరిష్కరించడం కోసమే అక్కడి మీడియాను ప్రత్యేకంగా పిలిచి మాట్లాడే ఏర్పాటు చేస్తున్నారు సాహో యూనిట్.
Tamil media not supporting Saaho movie and Issues between Journalists Producers are in high pk కష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు సాహో విషయంలో కూడా ఇదే జరుగుతుంది. 300 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు యూవీ క్రియేషన్స్. మరో 10 రోజుల్లో సినిమా విడుదల కానుంది. saaho,saaho movie pre release event,saaho movie pre release event passes,saaho movie pre release event RFC,saaho movie twitter,saaho movie instagram,saaho movie media,saaho tamil media,saaho producers,saaho movie updates,prabhas twitter,prabhas shraddha kapoor,ప్రభాస్,సాహో,సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్,సాహో మీడియా,సాహో తమిళ మీడియా,తెలుగు సినిమా
సాహో న్యూ పోస్టర్ (Source: Twitter)

మరి దీనికి వాళ్లెలా స్పందిస్తారో కూడా అర్థం కావడం లేదు. నిర్మాతలకు.. మీడియాకు మధ్య దూరం పెరగడంతో తమిళనాట మిగిలిన సినిమాలకు కూడా తిప్పలు తప్పడం లేదు. ఇక చెన్నై తర్వాత వరసగా మైసూరు, కోచి, ముంబైలో కూడా ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు సాహో యూనిట్. ఆగస్ట్ 18న రామోజీ ఫిలిం సిటీలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇందులో సినిమాలో కొన్ని ప్రత్యేకమైన కార్‌లను కూడా ప్రదర్శించబోతున్నారు. మొత్తానికి సాహోకు వచ్చిన ఈ అనుకోని మీడియా తిప్పలను తప్పించుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు యూనిట్. అది ఎంతవరకు పనికొస్తుందో చూడాలి.
Published by: Praveen Kumar Vadla
First published: August 17, 2019, 8:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading