కంగన రనౌత్‌పై ముంబైలో జరుగుతున్న పరిస్థితులను చూసి చాలా మంది సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఎందుకు ఆమెను అంతగా టార్గెట్ చేస్తున్నారు.. ప్రభుత్వం చేసిన తప్పులను నిలదీయడమే ఆమె చేసిన పాపమా అంటూ చాలా మంది కంగనకు సపోర్టుగా నిలుస్తున్నారు. అయితే చిత్రంగా బాలీవుడ్ మాత్రం ఈ విషయంపై సైలెంట్‌గా ఉంది. ప్రభుత్వంతో మనకెందుకు అన్నట్లు కంగన రనౌత్ వైపు ఎవరూ చూడటం లేదు. ఆమె కష్టపడి కట్టుకున్న ఆఫీస్‌ను కూల్చేస్తున్నా కూడా ఎవరూ నోరు మెదపలేదు.
కానీ సౌత్ ఇండస్ట్రీలో ఉన్న విశాల్ మాత్రం ఈ విషయంపై స్పందించాడు. కంగనకు సలాం చేసాడు. ధైర్యాన్ని చూసి మెచ్చుకున్నాడు. ఇదే విషయాన్ని ఓ లేఖలో విడుదల చేసాడు విశాల్. డియర్ కంగన అంటూ మొదలు పెట్టిన విశాల్.. మీరు చేస్తున్న పనులు చూసి నిజంగానే సలాం చేస్తున్నాను.. మీ ధైర్యం నాకు నచ్చింది.. ఏది తప్పు ఏది రైట్ అనేది పక్కనబెడితే ప్రభుత్వంపై మీరు చేస్తున్న పోరాటం నాకు నచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు విశాల్.
Dear @KanganaTeam pic.twitter.com/73BY631Kkx
— Vishal (@VishalKOfficial) September 10, 2020
మీ పర్సనల్ విషయం కాకపోయినా కూడా ప్రభుత్వంతో ఒంటరిగా ఫైట్ చేస్తున్నారు.. 1920ల్లో భగత్ సింగ్ ఎలాగైతే చేసాడో ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు. మీరు ఇస్తున్న ధైర్యమే ప్రజల్లో కూడా ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నానని చెప్పాడు విశాల్. వాళ్లు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తారని చెప్పాడు ఈ హీరో. సెలబ్రిటీస్‌కే కాదు కామన్ మ్యాన్‌కు కూడా మీరు ధైర్యాన్నిచ్చారు అంటూ ముగించాడు విశాల్. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అందరికీ ఉందని గుర్తు చేసాడు విశాల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vishal, Kangana Ranaut, Tamil Cinema