ప్రెజెంట్ విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరెక్కించిన ఈ సినిమా ఇక్కడ సంచలన విజయం సాధించింది. రీసెంట్గా ‘అయోగ్య’ షూటింగ్లో ఓ కష్టమైన స్టెప్పుకు డాన్స్ మూమెంట్స్ చేస్తోన్న సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైయ్యాడు. ఈ ప్రమాదంలో విశాల్ మోచేతికి, కాలికి గాయాలయ్యాయి. ఆ విషయం మరిచిపోకముందే విశాల్ మరోగారి గాయాలపాలైయ్యాడు. వివరాల్లోకి వెళితే..విశాల్..సి.సుందర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. ఈ సందర్భంగా బైక్‌పై విశాల్ స్టంట్ చేస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. ఈ సందర్భంగా విశాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విశాల్‌ను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. విశాల్‌కు యాక్సిడెంట్‌కు గురయ్యారన్న విషయం తెలుసుకొని ఆయన అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు. ప్రస్తుతం విశాల్ తమిళనాడు నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు TFPCకి చైర్మన్‌గా ఉన్నారు.
#NadigarSangam and #TFPC chief @VishalKOfficial was injured during a action bike stunt scene shoot in #Turkey for Dir #SundarC’s new film..#Vishal was rushed to hospital.
Wishing him a speedy recovery. pic.twitter.com/BjafdlEx26
— Sreedhar Pillai (@sri50) March 28, 2019
మరోవైపు విశాల్ హీరోగా నటించిన ‘అయోగ్య’ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాపై విశాల్ చాలా ఆశలే పెట్టుకున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Vishal