Home /News /movies /

TAMIL HERO VISHAL NEW RUGGED LOOK AFTER CORONA GOES VIRAL IN SOCIAL MEDIA PK

వామ్మో విశాల్ ఏంటి కరోనా వచ్చాక ఇలా అయిపోయాడు..?

Vishal (విశాల్ న్యూ లుక్)

Vishal (విశాల్ న్యూ లుక్)

Vishal Corona: ఇప్పుడు ఈయన్ని చూసిన తర్వాత అంతా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. విశాల్‌ను చూసి వామ్మో ఏంటి ఇలా మారిపోయాడు అంటున్నారు.

ఇప్పుడు ఈయన్ని చూసిన తర్వాత అంతా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. విశాల్‌ను చూసి వామ్మో ఏంటి ఇలా మారిపోయాడు అంటున్నారు. ఈయన ఈ మధ్యే కరోనా బారిన పడ్డాడు. ఈయనతో పాటు తండ్రికి జికే రెడ్డి కూడా కరోనా పాజిటివ్ అని వచ్చింది. పరీక్షలు నిర్వహించిన తర్వాత తన మేనేజర్‌కు పాజిటివ్ వచ్చిందని విశాల్‌ ట్వీట్ చేసాడు. ఆ తర్వాత ఈ వారం రోజుల్లో పూర్తిగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడామని.. వారంలోనే తాము కోలుకున్నామని చెప్పాడు ఈ హీరో.
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)

తాజాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను మనోధైర్యాన్ని కలిగించేలా విశాల్‌ ఓ వీడియో షేర్ చేశాడు. ఇది చూసి అంతా నువ్వు రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినా కూడా ఎలాంటి భయం అవసరం లేదని.. అసలు భయపడాల్సిన పని కూడా లేదని విశాల్ చెప్తున్నాడు. ఒకవేళ టెస్టులు చేసిన తర్వాత కూడా ఫలితాల కోసం టెన్షన్ పడొద్దని చెప్పాడు విశాల్. నాన్న గురించి జాగ్రత్తలు తీసుకుంటుంటే తనకు కూడా అవే లక్షణాలు కనిపించాయని.. శరీర ఉష్ణోగ్రత 100-103కి పైగా ఉందని తెలిపాడు ఈయన.

తర్వాత రోజు దగ్గు, జలుబు వచ్చిందని.. తన మేనేజర్ హరికి కూడా అవే లక్షణాలున్నాయని చెప్పాడు విశాల్. తాము ఆయుర్వేదిక్‌, హోమియోపతి మెడిసిన్స్ వాడామని.. క్రమ పద్దతిలో మెడిసిన్స్ వాడుతూ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో శరీర ఉష్ణోగ్రత, లక్షణాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాడు విశాల్. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండటంతో పాటు మందులు కూడా వాడామని చెప్పాడు ఈయన. వారం రోజుల్లోనే ఆరోగ్యంగా మారిపోయామని.. దాంతో కరోనా వచ్చినా కూడా ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్పాడు విశాల్.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Hero vishal, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు