హోమ్ /వార్తలు /సినిమా /

Hero Vikram: హీరో విక్రమ్ కు కరోనా.. దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

Hero Vikram: హీరో విక్రమ్ కు కరోనా.. దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తున్న మహమ్మారి

హీరో విక్రమ్ (ఫైల్ ఫొటో)

హీరో విక్రమ్ (ఫైల్ ఫొటో)

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తమిళ హీరో విక్రమ్ కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఒమిక్రాన్ వేరియెంట్ సైతం దేశాన్ని వణికిస్తోంది. సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రెటీల వరకు ఎవరినీ ఈ మహమ్మారి వదిలిపెట్టడం లేదు. తాజాగా తమిళ స్టార్ హీరో విక్రమ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆయన తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నారు. దీతో బుధవారం రాత్రి విక్రమ్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన హోం క్వారంటైన్లో ఉండి కరోనా చికిత్స తీసుకుంటున్నారు. విక్రమ్ ప్రస్తుతం తన కుమారుడు ధ్రువ్​ విక్రమ్​తో కలిసి 'మహాన్', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. శివపుత్రుడు, అపరిచితుడు, మల్లన్న, ఐ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత దగ్గరయ్యారు విక్రమ్. అపరిచితుడు సినిమా ఇక్కడ కాసుల వర్షం కురిపించింది. అనేక మంది తెలుగు ప్రేక్షకులను విక్రమ్ అభిమానులను చేసింది ఆ సినిమా. విలక్షణమైన పత్రలతో తన ప్రత్యేకతను చాటుతుంటారు విక్రమ్.

ఇదిలా ఉంటే.. బాలీవుడ్​ హీరోయిన్ కరీనా కపూర్​కు సైతం ఇటీవల కరోనా సోకింది. కరీనాతో పాటు మరో నటి అమృత అరోరాకు పాజిటీవ్ గా తేలింది. వీరిద్దరూ గత కొన్ని రోజులుగా కరోనా నిబంధనలు పాటించకుండా పలు పార్టీలకు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. గత కొద్దిరోజులుగా వీరిని కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని ముంబయి మున్సిపల్ కార్పొరేషన్​ ప్రకటన విడుదల చేసింది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. చాలా మంది నిబంధనలు పాటించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Omicron: తెలుగు రాష్ట్రాలకు ఒమిక్రాన్‌ వచ్చేసింది.. జనవరిలో స్పీడ్ రెట్టింపు.. పండగలపై ఆంక్షలు..!

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 7,974 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,948 మంది కోలుకున్నారు. 343 మరణాలు నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే కరోనా కేసులు ఏకంగా వెయ్యి పెరిగాయి.  తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,18,602కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,41,54,879 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,76,478 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 87,245 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. భారత్‌లో 20 రోజులుగా కొత్త కేసులు 10వేల లోపే నమోదవుతున్నాయి. ఐతే ఇవాళ్టి బులెటిన్‌లో ఉన్న మొత్తం కేసులు సగానికి పైగా నుంచేే వచ్చాయి. అక్కడ మళ్లీ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

First published:

Tags: Chiyan Vikram, Corona, Covid -19 pandemic, Omicron, Vikram

ఉత్తమ కథలు