తమన్నా సారీ చెప్పమ్మా... ఆ హీరో ఫ్యాన్స్ డిమాండ్

షూటింగ్‌కు వెళ్లామా? వచ్చామా? అన్నట్టు ఉండేది. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడను అని చెప్పింది తమన్నా.

news18-telugu
Updated: October 15, 2019, 10:09 AM IST
తమన్నా సారీ చెప్పమ్మా... ఆ హీరో ఫ్యాన్స్ డిమాండ్
తమన్నా ( ట్విట్టర్ ఫోటో)
  • Share this:
అభిమానం హద్దులు దాటితే కొందరు ఫ్యాన్స్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటారు. అయినదానికి కాని దానికి నానా యాగీ చేస్తుంటారు. తమన్నా విషయంలో ఓ హీరో అభిమానులు ఇలానే ప్రవర్తిస్తున్నారు. ఆ హీరో గురించి తనకు సరిగా తెలియదన్న పాపానికి... తమన్నా సారీ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభించేశారు. దాదాపుగా అందరూ ఫ్యాన్స్ ఇలాగే ఉంటారు. కాకపోతే.. తమిళ హీరోల ఫ్యాన్స్ మాత్రి ఇలాంటి హడావుడి చేయడంలో కాస్త ముందుంటారు.

మరీ ముఖ్యంగా తమిళంలో విజయ్, అజిత్ అభిమానుల గొడవలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అజిత్ అభిమానులు.. తమ హీరో సినిమా గురించి విమర్శించిందని చిన్మయిని ఇలాగే టార్గెట్ చేశారు. తాజాగా విజయ్ ఫ్యాన్స్.. తమన్నా మీద ఫైర్ మండిపోతున్నారు. అయితే తమన్నా విజయ్ గురించి ఎలాంటి నెగెటివ్ కామెంట్ కూడా చేయలేదు.విజయ్‌తో కలిసి సుర అనే సినిమాలో కలిసి నటించింది తమన్నా. అయితే ఆయన గురించి మాట్లాడమని ఓ ఇంటర్వ్యూలో అడిగితే తనకు విజయ్ గురించి పెద్దగా ఏం తెలియదంది.

విజయ్ గురించి తనకు ఎందుకు ఏదీ పెద్దగా తెలియదో అన్న దానికి తమ్మూ వివరణ కూడా ఇచ్చింది.``విజయ్ సర్ గురించి నాకేం తెలియదు. ఒక సినిమాలో ఆయనతో కలిసి నటించాను. కానీ, ఆ సమయంలో ఆయనకు, నాకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ లేదు. ఆయన పనేదో ఆయనది అన్నట్టు ఉండేవారు. షూటింగ్‌కు వెళ్లామా? వచ్చామా? అన్నట్టు ఉండేది. అలాంటి వ్యక్తి గురించి నేనేం మాట్లాడను. ఆయన గురించి ఏమీ తెలియకుండా కామెంట్ చేయలేను అని చెప్పింది తమన్నా. అంతే ... ఆ మాత్రం దానికే విజయ్ ఫ్యాన్స్ హర్టయ్యారు. తమన్నా తమ హీరోకు క్షమాపణలు చెప్పాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై తమన్నా ఎలా స్పందిస్తుందో...విజయ్ ఏమైనా మాట్లాడతారో వేచి చూడాల్సిందే.
Published by: Sulthana Begum Shaik
First published: October 15, 2019, 10:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading