తమిళ హీరో విజయ్ కొడుకు తెరంగేట్రం.. మెగా హీరో సినిమాతో..

Vijay Son Sanjay: తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. ఈయనకు వారసుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కూడా హీరో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 1, 2020, 5:58 PM IST
తమిళ హీరో విజయ్ కొడుకు తెరంగేట్రం.. మెగా హీరో సినిమాతో..
విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ (Vijay Son Janson Sanjay)
  • Share this:
తమిళ ఇండస్ట్రీలో రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. ఈయనకు వారసుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రాడు కూడా హీరో కాబోతున్నాడు. ప్రస్తుతం కెనడాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు విజయ్ కొడుకు సంజయ్. లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంజయ్ ఈ మధ్యే ఇండియాకు వచ్చాడు. ఇక తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడు విజయ్. అయితే సరైన కథ కోసం చూస్తున్నాడు ఈయన. ప్రస్తుతం సంజయ్ వయసు 19 ఏళ్లు. మంచి కథ దొరికితే కొడుకుని పరిచయం చేయాలని చూస్తున్నాడు విజయ్.

విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ (Vijay Son Janson Sanjay)
విజయ్ కొడుకు జాన్సన్ సంజయ్ (Vijay Son Janson Sanjay)


ఈ క్రమంలోనే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన కథ విజయ్‌కు బాగా నచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా విడుదల కాలేదు.. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఉప్పెన కరోనా కారణంగా వాయిదా పడింది. ఎప్రిల్ 2నే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. నల్గొండ పరువు హత్యల నేపథ్యంలో ఈ సినిమా కథను రాసుకున్నాడు బుచ్చిబాబు. విషాందాంత ప్రేమకథగా ఉప్పెన వస్తుందని ప్రచారం జరుగుతుంది.

ఉప్పెన రీమేక్‌తో విజయ్ కొడుకు సంజయ్ అరంగేట్రం (Vijay Son Sanjay in Uppena Remake)
ఉప్పెన రీమేక్‌తో విజయ్ కొడుకు సంజయ్ అరంగేట్రం (Vijay Son Sanjay in Uppena Remake)


ఈ సినిమా ఇంకా విడుదలే కాలేదు అప్పుడే తమిళనాట రీమేక్ కాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇక్కడ వైష్ణవ్ తేజ్ పరిచయం అయినట్లే.. అక్కడ కూడా స్టార్ హీరో విజయ్ కొడుకు ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఉప్పెన సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతి.. ప్రస్తుతం విజయ్‌తో మాస్టర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌లో ఉప్పెన కథ గురించి విజయ్‌తో సేతుపతి డిస్కస్ చేసినట్లు తెలుస్తుంది.

ఉప్పెన రీమేక్‌తో విజయ్ కొడుకు సంజయ్ అరంగేట్రం (Vijay Son Sanjay in Uppena Remake)
ఉప్పెన రీమేక్‌తో విజయ్ కొడుకు సంజయ్ అరంగేట్రం (Vijay Son Sanjay in Uppena Remake)


ఈ కథ అయితే సంజయ్ డెబ్యూ సినిమాకు సరిగ్గా సరిపోతుందని విజయ్ సేతుపతి చెప్పడంతో విజయ్ కూడా ఓకే అన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రితో పాటు విలన్ పాత్ర కూడా చేస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళనాట ఈ సినిమాను తానే నిర్మించాలని చూస్తున్నాడు విజయ్ సేతుపతి. మొత్తానికి విడుదలకు ముందే ఉప్పెన గురించి తమిళనాట రీమేక్ వార్తలు వినిపిస్తున్నాయి.
First published: July 1, 2020, 5:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading