హోమ్ /వార్తలు /సినిమా /

తమిళ హీరో సూర్యకు కరోనా కష్టాలు.. ఆయన ఫ్యామిలీని బ్యాన్ చేయాలంటూ..

తమిళ హీరో సూర్యకు కరోనా కష్టాలు.. ఆయన ఫ్యామిలీని బ్యాన్ చేయాలంటూ..

సూర్య Photo : Twitter

సూర్య Photo : Twitter

ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగున్న సినిమాలకు కరోనా పెద్ద దెబ్బే తీసింది. తాజాగా తమిళ హీరో సూర్య తీసుకొన్న నిర్ణయంపై అక్కడి థియేటర్స్ యాజమాన్యాలు భగ్గుమంటున్నాయి.

ఇంకా చదవండి ...

  ఎంకి పెళ్లి ఇంకెవెడో చావుకు వచ్చినట్టు ఇపుడు కరోనా మహామ్మారి కారణంగా దేశంలోని అన్ని రంగాలు కుదేలయ్యాయి. అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఉంది. ఇప్పటికే కరోనా లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగున్న సినిమాలకు కరోనా పెద్ద దెబ్బే తీసింది. సినిమాల రిలీజ్‌ కోసం చాలా మంది సినీ నిర్మాతలు థియేటర్స్ ఎఫుడు ఓపెన్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకొందరు ఒకడుగు ముందుడుగు వేసి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఇంకొందరు ఉన్నారు. ఐతే.. తమిళనాడులో మాత్రం థియేటర్స్‌లో కాకుండా నిర్మాతలు ఓటీటీలో తమ సినిమాలను  విడుదల చేస్తామంటే ససేమిరా అంటున్నారు. థియేటర్స్‌లో విడుదల చేయడానికి నిర్మించిన చిత్రాలను ముందుగా అక్కడే విడుదల చేయాలని అక్కడి థియేటర్స్ యాజమాన్యాలు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తే సదరు చిత్ర నిర్మాతలతో పాటు అందుదలో నటించిన వాళ్ల సినిమాలను ఇకపై థియేటర్స్‌లో ప్రదర్శించమని చెబుతున్నారు.

  జ్యోతిక కొత్త చిత్రం (ponmagal vandhal)
  జ్యోతిక కొత్త చిత్రం (ponmagal vandhal)

  తాజాగా తమిళ హీరో సూర్య భార్య జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన పొనుమగళ్ వందాళ్  చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో తమిళ థియేటర్స్ యాజమాన్యం సూర్యపై భగ్గుమన్నాయి. సూర్య తన నిర్ణయం మార్చుకోకపోతే.. ఆయన యాక్ట్ చేసిన సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయబోమని ఆల్టీమేటం జారీ చేసాయి. జ్యోతిక నటించిన ‘పొన్‌మగళ్ వందాళ్’ చిత్రాన్ని థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా అమెజాన్‌ ప్రైమ్‌లో మొదటి వారంలో విడుదల చేయాలని సూర్య నిర్ణయం తీసుకోవడం  అక్కడి నిర్మాతల సంఘాల వారు సూర్యపై భగ్గుమంటున్నారు. మొదట థియేటర్స్‌లో విడుదల చేసిన తర్వాత ఎక్కడ విడుదల చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తమిళ థియేటర్స్ యాజమాన్య సంఘం హెచ్చరించింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Amazon prime, Kollywood, Suriya, Tollywood

  ఉత్తమ కథలు