Rashmika Mandanna | అయ్యో.. రష్మిక మందన్నా ఎంతపని చేసేసింది...

ఇటీవల రష్మికా మందన్నా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు రష్మిక క్యాలెండర్‌లో ఉన్నాయి.

news18-telugu
Updated: August 18, 2019, 2:45 PM IST
Rashmika Mandanna | అయ్యో.. రష్మిక మందన్నా ఎంతపని చేసేసింది...
రష్మిక మందన్నా (File Photo)
  • Share this:
రష్మిక మందన్నా తొందరపాటు పని ఓ యువ హీరోకి ఆగ్రహం తెప్పించింది. ఆ హీరో ఎవరో కాదు. తమిళ నటుడు కార్తీ. సూర్య తమ్ముడు అయిన కార్తీ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా, కార్తీ హీరోగా ఓ సినిమా షూటింగ్ జరుపుకొంటోంది. మంచి మాస్ మసాలా సినిమాకు అదే రేంజ్‌లో టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే, ఆ విషయం మీడియాకు తెలియకుండా సినిమా యూనిట్ సైలెంట్‌గా వ్యవహరించింది. ఓ భారీ ఈవెంట్ నిర్వహించి సినిమాపేరును ప్రకటిస్తే మూవీకి హైప్ క్రియేట్ అవుతుందని కార్తీ భావించాడు. అయితే, రష్మిక మందన్నా వల్ల అతడి ప్లాన్ మొత్తం విఫలమైంది. తొలి తమిళ సినిమా కావడంతో రష్మికా బాగా ఎగ్జైట్‌మెంట్‌తో ఉంది. దీంతో ఓ మీడియా సమావేశంలో కార్తీ సినిమా పేరును చెప్పేసింది. ఆ తర్వాత నాలిక కరుచుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. రష్మిక చేసిన పనికి ఏమీ అనలేక పాపం కార్తీ తాను ప్లాన్ చేసిన భారీ ఈవెంట్‌ను రద్దు చేసుకున్నాడట. ఇంతకీ సినిమా పేరు ఏంటని మీరు ఆలోచిస్తున్నారా. మూవీ పేరు సుల్తాన్.

ఇటీవల రష్మికా మందన్నా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు రష్మిక క్యాలెండర్‌లో ఉన్నాయి. కార్తీతో నటిస్తున్న సుల్తాన్ సినిమా ఈ ఏడాది దసరాకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 18, 2019, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading