Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /సినిమా /

నిన్న నాని.. ఇపుడు కార్తి.. చిరంజీవి సూపర్ హిట్ టైటిల్స్‌ను వాడేసుకుంటున్నారుగా..

నిన్న నాని.. ఇపుడు కార్తి.. చిరంజీవి సూపర్ హిట్ టైటిల్స్‌ను వాడేసుకుంటున్నారుగా..

నాని, చిరంజీవి, కార్తి

నాని, చిరంజీవి, కార్తి

గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న  కొత్త సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టారు. తాజాగా కార్తి కూడా చిరంజీవి పాత సూపర్ హిట్ టైటిల్‌ను తన కొత్త సినిమాకు వాడుకోబోతున్నాడు.

ఇంకా చదవండి ...

    గత కొన్నేళ్లుగా తెలుగులో సూపర్ హిట్ అయినా  పాత సినిమాల టైటిల్స్‌ను కొత్త సినిమాలకు పెట్టడం కామన్ అయిపోయింది. ఇప్పటికే  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటిస్తున్న  కొత్త సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టారు. పేరు బాగానే మెగా ఫ్యాన్స్ మాత్రం నాని ఓ ఆట ఆడుకుంటున్నారు. నువ్వు గ్యాంగ్ లీడర్ ఏంటి ? ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి అంటూ నానిపై దుమ్మెత్తి పోస్తున్నారు. నాని కొత్త సినిమాకు  ‘గ్యాంగ్ లీడర్‌’ టైటిల్‌పై మెగా ఫ్యాన్స్ పెద్ద రచ్చే చేస్తున్నారు. తాజాగా ఈ వివాదం సద్దుమణగకముందే తమిళ హీరో కార్తి..చిరంజీవికి హీరోగా బ్రేక్ ఇచ్చిన ఆల్ టైమ్ హిట్  ‘ఖైదీ’ సినిమా టైటిల్‌ను వాడేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు.


    కార్తి సరసన రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మార్చ్‌లో మొదలుకానుంది. ఈ సినిమాను తమిళంలో ‘మా నగరం’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. తమిళంలో ఎలాగే ‘ఖైదీ’ టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్..తెలుగులో కూడా అదే టైటిల్‌తో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తానికి మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ చిత్రమైన ‘ఖైదీ’ టైటిల్‌తో కార్తి ఏ మేరకు విజయం అందుకుంటాడో చూడాలి.

    First published:

    Tags: Chiranjeevi, Karthi, Nani, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు