సిల్వర్ స్క్రీన్ పెళ్లిళ్లు...ఒక్కోసారి నిజజీవితంలో కూడా అవుతుంటాయి. రీల్ లైఫ్‌లో ఎన్నో సార్లు పెళ్లి పీఠలెక్కే.. ఆ జంటలు రియల్ లైఫ్‌లో కూడా పీపీ..డుండుం...అనేస్తున్నారు. పెళ్లి సందడి చేస్తున్నారు. దీనికి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో ఉన్న హీరో, హీరోయిన్లు ఎప్పుడో అపుడు నిజజీవితంలో తలంబ్రాలు పోసుకుంటూ మాంగల్యం తంతునానేనా అనిపించుకుంటున్నారు. రీసెంట్గా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, రణ్వీర్, దీపికాలు వారి ప్రేమాయాణాన్ని పెళ్లి అనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి చేసుకున్నారు.
సౌత్ విషయానికొస్తే...చాలా మంది హీరో, హీరోయిన్లు వాళ్ల రీల్ లైప్ ప్రేమను రియల్ లైఫ్‌లో కంటిన్యూ చేసి ఒకటయ్యారు. ఇప్పటి విషయానికొస్తే..నాగ చైతన్య, సమంతలు వారి ప్రేమ బంధాన్ని పెళ్లితో ముడివేసుకున్నారు.
తాజాగా ఒకింటివాళ్లు అవుతున్న జంటల్లో ఆర్య, సాయేషా సైగల్ చేరబోతున్నారు. ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సాక్షిగా ఆర్య ట్విట్టర్ వేదికగా అఫీషియల్‌గా ప్రకటించారు.దీంతో సూర్య, మోహన్ లాల్ పలువురు ప్రముఖులు వీళ్లకు అభినందలు తెలియజేశారు.
అంతేకాదు తొందర్లోనే వీరి పెళ్లి తేదిని అఫీషియల్‌గా ప్రకటిస్తారట. 2018లో ‘గజినీకాంత్’ అనే తమిళ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు.అప్పటి నుంచి వీళ్లిద్దరికీ ఒకరిపై ఇంకొకరికీ ప్రేమ కలిగింది.
ప్రస్తుతం వీళ్లిద్దరు కే.వి.ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తోన్న ‘కప్పం’ సినిమాలో మరోసారి జంటగా నటిస్తున్నారు. సాయేషా తెలుగుతో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. హిందీలో ‘శివాయ్’ చిత్రంలో నటించింది. ఆర్య విషయానికొస్తే..తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘వరుడు’తో పాటు..అనుష్క హీరోయిన్గా నటించిన ‘సైజ్ జీరో’లో హీరోగా నటించాడు.
బాలీవుడ్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్లు
ఇవి కూడా చదవండి
విక్రమ్ కుమార్ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన నాని
జబర్దస్త్ బ్యూటీ దేశ సేవ.. నేను నా దేశం అంటున్న రష్మీ గౌతమ్..
పవన్ కల్యాణ్ హీరోయిన్‌పై ఛీటింగ్ కేసు... చిక్కుల్లో బాలీవుడ్ హాట్ హీరోయిన్...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhil, Anushka, Arya, Kollywood, Sayyesha saigal, Tollywood