లాక్ డౌన్ ఎఫెక్ట్.. కిరాణా కొట్టు పెట్టుకున్న డైరెక్టర్...

ఇప్పుడప్పుడే సినిమా షూటింగ్‌లు జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఓ దర్శకుడు లైట్స్, కెమెరా, యాక్షన్ అనడం మానేసి బియ్యం, ఉప్పు, చింతపండు కట్టుకోవడం మొదలు పెట్టాడు.

news18-telugu
Updated: July 4, 2020, 2:41 PM IST
లాక్ డౌన్ ఎఫెక్ట్.. కిరాణా కొట్టు పెట్టుకున్న డైరెక్టర్...
కిరాణా షాపులో డైరెక్టర్ ఆనంద్ (Image;ANI)
  • Share this:
కరోనా వైరస్, లాక్ డౌన్ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ. లాక్ డౌన్ నుంచి చాలా మినహాయింపులు వచ్చినా కూడా సినిమా హాళ్లకు మాత్రం ఇంకా మోక్షం రాలేదు. ఇప్పుడప్పుడే సినిమా షూటింగ్‌లు జరిగే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఓ దర్శకుడు ఇక లైట్స్, కెమెరా, యాక్షన్ అనడం మానేసి బియ్యం, ఉప్పు, చింతపండు కట్టుకోవడం మొదలు పెట్టాడు. అతడు చెన్నైకి చెందిన దర్శకుడు ఆనంద్. ఆనంద్ గత పది సంవత్సరాల నుంచి కోలీవుడ్‌లో ఉన్నాడు. కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్‌లు ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలీదు. పైగా తమిళనాట కరోనా కేసులు బీభత్సంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాను ఇన్ని రోజులుగా దాచి పెట్టుకున్న కొంత డబ్బుతో ఓ కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. చెన్నైలోని మౌలివాక్కంలో తాను అద్దెకు ఉంటున్న ఇంటి వద్దే ఓ భవనంలో షాపు అద్దెకు తీసుకుని కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. అతడే షాపులో కూర్చుని వ్యాపారం చేసుకుంటున్నాడు.

‘కరోనా లాక్ డౌన్ కాలంలో పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యా. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం కిరాణా షాపులు, నిత్యావసర షాపులు మాత్రమే తెరవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. దీంతో నేను కూడా ఓ షాపు తీసుకుని కిరాణా కొట్టు పెట్టా. అన్నీ సరుకులూ అమ్ముతున్నా. ఆయిల్, పప్పులు, బియ్యం అన్నీ అమ్ముతున్నా. ఎక్కువ మందిని ఆకర్షించడానికి కొంచెం తక్కువకే సరుకులు ఇస్తున్నా.’ అని ఆనంద్ చెబుతున్నాడు. వచ్చే సంవత్సరం వరకు సినీ పరిశ్రమ తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అప్పటి వరకు ఇలాగే కొట్లో కూర్చుని వ్యాపారం చేసుకుంటా అంటున్నాడు. ఆనంద్ ‘ఒరు మళై నాంగు సారళ్’, ‘మౌన మళై’ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ‘తునిత్తు సై’ అనే సినిమా చివరగా రెండు పాటలు పెండింగ్‌లో ఉండగా లాక్ డౌన్ వచ్చింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 4, 2020, 2:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading