Director Shankar mother passed away: శంకర్‌కు మాతృవియోగం.. తీవ్ర విషాదంలో సంచలన దర్శకుడు..

దర్శకుడు శంకర్ తల్లిగారు కన్నుమూత (Shankar mother passed away)

Director Shankar mother passed away: సినీ ప్రముఖుల ఇళ్ళలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా దర్శకుడు శంకర్(Shankar Shanmugam) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈమె తల్లి గారు ముత్తులక్ష్మి కన్నుమూసారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఈమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

  • Share this:
సినీ ప్రముఖుల ఇళ్ళలో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. రామ్ పోతినేని తాతగారు మరణించి అక్కడ విషాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగానే తాజాగా దర్శకుడు శంకర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈయన తల్లి గారు ముత్తులక్ష్మి కన్నుమూసారు. వయోభారం, అనారోగ్య కారణాలతో ఈమె మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముత్తులక్ష్మి వయసు 88 సంవత్సరాలు. చెన్నైలోని స్వగృహంలోనే ముత్తులక్ష్మి కన్నుమూసారు. శంకర్ అమ్మగారు చనిపోయిన విషయం తెలియగానే తమిళ ఇండస్ట్రీ ప్రముఖులు అంతా ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థించారు. శంకర్‌తో పని చేసిన హీరోలు, నిర్మాతలు వరసగా ఆయన్ని ఫోన్‌లోనే పరామర్శిస్తున్నారు. కరోనా కారణంగా ఎవరూ ఇంటికి రావద్దంటూ ఈయన కూడా విజ్ఞప్తి చేసారు. ఈమె అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నాయి. ఏ సినిమా చేసినా కూడా ముందు అమ్మ ఆశీర్వాదంతోనే మొదలు పెట్టేవాడు శంకర్.

ఆమె మరణంతో తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు ఈయన. ఇక కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమాకు కమిటయ్యాడు శంకర్. దాంతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా లైన్‌లోనే ఉంది.
Published by:Praveen Kumar Vadla
First published: