Nayanthara: నయనతార కంటే ఆ భామే బెస్ట్ అంటూ దర్శకుడి షాకింగ్ కామెంట్స్..

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా, దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా తన సత్తా చాటుతోంది నయనతార. తాజాగా ఒక తమిళ దర్శకుడు నయనతార కంటే ఆ నటే బెటర్ అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారింది.

news18-telugu
Updated: September 6, 2019, 10:51 AM IST
Nayanthara: నయనతార కంటే ఆ భామే బెస్ట్ అంటూ దర్శకుడి షాకింగ్ కామెంట్స్..
నయనతార (Twitter.com/Nayanthara)
  • Share this:
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా, దక్షిణాదినే టాప్ హీరోయిన్లలో ఒకరిగా తన సత్తా చాటుతోంది నయనతార.అంతేకాదు సౌత్‌లోనే అత్యధిక పారితోషకం అందుకుంటున్న హీరోయిన్‌గా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు బడా స్టార్ హీరోలే తమ సినిమాలకు నయనతార డేట్ల కోసం వెయిట్ చూస్తూ ఉన్నారు. ఒకవైపు పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు  లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేస్తోంది నయనతార. అయితే అయితే ఇటీవల ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరచడం, అందులోనూ తను నటించిన హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలు ఫ్లాప్‌ అవడం ఆమె ఇమేజ్‌ను కాస్త డామేజ్ చేసినా ప్రస్తుతం ఈ భామ రజనీకాంత్‌తో దర్బార్ మూవీలో యాక్ట్ చేస్తోంది. మరోవైపు తమిళ స్టార్ హీరో విజయ్‌తో ‘బిగిల్’ సినిమాలు చేస్తోంది.  అదే విధంగా టాలీవుడ్‌ మోగాస్టార్‌ చిరంజీవికి జంటగా ‘సైరా నరసింహారెడ్డి’ వంటి భారీ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్న నయనతారను.. నందా పెరియస్వామి అనే దర్శకుడు నయనతార కంటే తాప్సీ   బెస్ట్‌ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

నయనతార,తాప్సీ (File photo)


అతను నయనతారను అలా ఎందుకు ఆలా అనాల్సి ఒచ్చిందో వివరణ ఇచ్చాడు.  . వివరాల్లోకి వెళితే... నందా పెరియస్వామి అనే తమిళ దర్శకుడు మరియు నటుడు ఒక కథను తయారు చేసుకుని దాన్ని 12 నిమిషాల నిడివితో చిన్న డెమో ఫిలింను రూపొందించారు ఈ చిత్రాన్ని ఛాయాగ్రాహకుడి ద్వారా నటి నయనతారకు చేరవేశారు. అది చూసిన నయనతార ఫెంటాస్టిక్, మార్వ్‌లెస్‌ అని మెచ్చుకోవడంతో పాటు, ఈ కథను తానే నిర్మించి నటిస్తానని చెప్పిందట. అంతేకాదు డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం.. నయనతార అడిగిన పారితోషకం పెట్టిన కండిషన్స్ కూడా ఒప్పుకున్నాడట నందా పెరియస్వామి. ఐతే ఈ డెమో వీడియో చూసి యేడాది అవతున్న నయనతార మాత్రం  ఏ మాట మాట్లాడలేదట, అలా సంవత్సరంకు పైగా ఊరిస్తూ ఎపుడు యాక్ట్ చేసేది చెప్పడం లేదట. అయితే ఆ కథ తోనే ఇప్పుడు ‘రష్మి రాకెట్‌’ పేరుతో చిత్రం రూపొందుతోంది. అందులో నటి నయనతార పోషించాల్సిన పాత్రలో తాప్సీ నటిస్తోంది.దీనిపై దర్శకుడు నందా పెరియస్వామి తన ఫేస్‌బుక్‌లో పేర్కొంటూ నయనతార కంటే నటి తాప్సీనే బెటర్‌ అని కామెంట్స్ చేసాడు. ఈ కామెంట్స్ పై నయనతార ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 6, 2019, 10:51 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading