ఈ తరం దర్శకులకు ఓ సూపర్ స్టార్‌తో సినిమా చేయడానికే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఓ దర్శకుడు మాత్రం కేవలం ఏడాది గ్యాప్‌లోనే ముగ్గురు సూపర్ స్టార్స్‌ను పట్టేసాడు. అందర్నీ వరసగా లైన్‌లో పెడుతున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలు.. కమిటైన సినిమాలు చూస్తుంటే వామ్మో ఎవరీ దర్శకుడు.. ఎక్కడ్నుంచి వచ్చాడు అనుకుంటూ ఆయన గురించే చర్చించుకుంటున్నారు. తమిళనాట మాత్రమే కాదు.. సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆ దర్శకుడి గురించి మాట్లాడుకుంటున్నారు. ఆయనే లోకేష్ కనకరాజ్.. గతేడాది ఖైదీ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈయన.. మాస్టర్ సినిమాతో విజయ్‌ను డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు కానీ అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. విజయ్, విజయ్ సేతుపతి లాంటి ఇద్దరు స్టార్ హీరోలను సినిమాలో పెట్టి కేవలం 5 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసాడు లోకేష్. ఈ సినిమా కరోనా కారణంగా విడుదల కాలేదు.
2021 సంక్రాంతికి మాస్టర్ విడుదలయ్యేలా కనిపిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాలు భారీగా పెంచేసింది. ఇదిలా ఉండగానే ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. ముఖ్యంగా అందులో కమల్ లుక్ కూడా పిచ్చెక్కించింది. ఈయన టీజర్ కట్ చేసిన విధానం చూసి లోకేష్ కనకరాజ్ మార్క్ ఏంటో అర్థమవుతుంది.
ఒకానొక సమయంలో అక్కడ దెయ్యం ఉండేది అంటూ ఈ టీజర్ కట్ చేసాడు లోకేష్. ఏడాది గ్యాప్‌లోనే మూడు సినిమాలు చేసి అందరి దృష్టిలో పడ్డాడు లోకేష్ కనకరాజ్. ఈయన దూకుడు చూసి కుర్రాడు మామూలోడు కాదు అనుకుంటున్నారంతా. కార్తి, విజయ్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలను చాలా తక్కువ టైమ్‌లో డైరెక్ట్ చేసాడు.. చేస్తున్నాడు లోకేష్ కనకరాజ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Lokesh Kanagaraj, Tamil Cinema