ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు.. సిటిజెన్‌షిప్‌పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పటికే ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించగా.. తాజాగా తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకించారు.

news18-telugu
Updated: December 17, 2019, 1:36 PM IST
ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు.. సిటిజెన్‌షిప్‌పై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన
  • Share this:
కేంద్రం తీసుకొచ్చిన జాతీయ పౌరసత్వ నమోదు (NRC) చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. విపక్షాలు,అభ్యుదయ వాదులు ఎన్‌ఆర్‌సీ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇప్పటికే ఎన్‌ఆర్‌సీని వ్యతిరేకించగా.. తాజాగా తమిళ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.'భారత్‌ను లౌకికవాద దేశంగా ఉండనివ్వండి. ఎన్‌ఆర్‌సీ,సీఏఏలకు నో చెప్పండి. అలాగే విద్యార్థులపై పోలీసుల దమనకాండను ఖండించండి.' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు,'ఈ దేశం ఎవడబ్బ సొత్తు కాదు' అని తమిళంలో రాశారు. కార్తీక్ సుబ్బరాజు 'పిజ్జా','జిగర్తాండ','పేట' వంటి సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

కాగా, కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం దేశవ్యాప్తంగా అగ్గి రాజేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో నుంచి వలస వచ్చిన శరణార్థులకు ఈ చట్టం ద్వారా పౌరసత్వం కల్పించనున్నారు. అయితే ఇందులో ముస్లింలకు స్థానం కల్పించకపోవడంపై వివాదం రేగుతోంది. దేశంలో విభజన రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇది ముస్లింలను లక్ష్యంగా చేసుకుని చేసిన చట్టం కాదని,ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతోంది.

First published: December 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు