విశాల్ పై ఘోరమైన కామెంట్... పరాకాష్టకు చేరిన తమిళ నటుల ఎన్నికల ఫైట్..

దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు, అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా తమిళ సినీరంగానికి మరోసారి రాజకీయ సెగ అంటుకుంటోంది. పదవులకోసం ఒకరిపై ఒకరు ఘోరమైన వ్యాఖలు చేసుకునే దుస్థితికి తమిళ సినీ ఇండస్ట్రీ దిగజారిపోయింది. తాజాగా తమిళ సినీ నటుల సంఘం ఎన్నికల్లో దూషణలు పరాకాష్టకు చేరుకున్నాయి.తాజాగా ఈ దర్శకుడు విశాల్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి.

news18-telugu
Updated: June 18, 2019, 1:31 PM IST
విశాల్ పై ఘోరమైన కామెంట్... పరాకాష్టకు చేరిన తమిళ నటుల ఎన్నికల ఫైట్..
విశాల్ (Hero Vishal)
  • Share this:
దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు, అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ఎంతో మంది నటీనటులు రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. తాజాగా తమిళ సినీరంగానికి మరోసారి రాజకీయ సెగ అంటుకుంటోంది. పదవులకోసం ఒకరిపై ఒకరు ఘోరమైన వ్యాఖలు చేసుకునే దుస్థితికి తమిళ సినీ ఇండస్ట్రీ దిగజారిపోయింది. తాజాగా తమిళ సినీ నటుల సంఘం ఎన్నికల్లో దూషణలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారా స్థాయికి చేరాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం నడిగర్ సంఘం కార్యదర్శిగా కొనసాగుతున్న విశాల్ నేతృత్వంలోని టీంను ఓడించేందుకు, భాగ్యరాజా ప్యానల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఈ సందర్భంగా భాగ్యరాజా కు సపోర్ట్ చేస్తున్న సీనియర్ దర్శకుడు భారతీరాజా విశాల్ ను విమర్శిస్తూ చేసిన వ్యాఖలు కలకలం రేపుతున్నాయి.

Tamil director Bharathi raja sensational comments vishal Due Nadigar sangam Elections,vishal,vishal nadigar sangam,nadigar sangam,Bharathi raja,Bharathi raja sensational comments on vishal,nadigar sangam election,nadigar sangam latest news,nadigar sangam election 2019,vishal nadigar sangam,nadigar sangam building,nadigar sangam latest news today,nadigar sangam elections,vishal nadigar sangam issue,nadigar sangam election fight,vishal nadigar sangam issue latest,nadigar sangam issue,nadigar sangam latest news 2019,vishal nadigar sangam election,vishal in nadigar sangam election,విశాల్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,విశాల్ పై భారతీ రాజా కామెంట్స్,విశాల్ పై భారతీ రాజా సెన్సేషనల్ కామెంట్స్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,కోలీవుడ్ న్యూస్,తమిళ సినిమా,
నడిగర్ సంఘం ఎన్నికల్లో పోటీ పడుతున్న విశాల్,భాగ్యరాజ్

నడిగర్ సంఘం తమిళులు కానీ  తెలుగు వ్యక్తుల చేతుల్లో ఉందన్నారు.  ఇలాంటి పరిస్థితి ఉండటం చాలా బాధగా ఉందన్నారు.ఈ సందర్భంగా  తమిళ నటుల ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ భారతీరాజా వ్యాఖ్యానించారు. అంతేకాదు విశాల్‌ను ఉద్దేశిస్తూ తమిళ నిర్మాతల మండలిలో ఓ పందికొక్కు చేరిందని దాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చాడు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్‌ని చిత్తుచిత్తుగా ఓడించి భాగ్యరాజా ప్యానల్ ని గెలిపించుకోవాలని తమిళ నటులకు పిలుపునిచ్చాడు  దర్శకుడు భారతి రాజా. అంతేకాదు నడిగర్ సంఘం ఎన్నికలు అయ్యాక దాన్ని తమిళ నటుల సంఘం గా పేరు మార్చాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు భారతీరాజా.  ఇక తమిళనాడును ముఖ్యమంత్రులుగా పాలించిన నటులు ఎంజీఆర్,జయలలిత,కరుణానిధి తమిళులు కాదు. మరోవైపు రజినీకాంత్ కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తి కాదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Tamil director Bharathi raja sensational comments vishal Due Nadigar sangam Elections,vishal,vishal nadigar sangam,nadigar sangam,Bharathi raja,Bharathi raja sensational comments on vishal,nadigar sangam election,nadigar sangam latest news,nadigar sangam election 2019,vishal nadigar sangam,nadigar sangam building,nadigar sangam latest news today,nadigar sangam elections,vishal nadigar sangam issue,nadigar sangam election fight,vishal nadigar sangam issue latest,nadigar sangam issue,nadigar sangam latest news 2019,vishal nadigar sangam election,vishal in nadigar sangam election,విశాల్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,విశాల్ పై భారతీ రాజా కామెంట్స్,విశాల్ పై భారతీ రాజా సెన్సేషనల్ కామెంట్స్,నడిగర్ సంఘం ఎలక్షన్స్,కోలీవుడ్ న్యూస్,తమిళ సినిమా,
విశాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ దర్శకుడు భారతీ రాజా

నడిగర్ సంఘంలో దక్షిణాదికి చెందిన నాలుగు భాషల నటీనటులు సభ్యులుగా కొనసాగుతున్నారు . తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులు సభ్యులుగా ఉన్నారు .మరో వైపు విశాల్ సంబంధించిన టీం కూడా ఈ ఎన్నికల్లో మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి శక్తిమేర ప్రయత్నిస్తున్నారు. గతంలో ఈ పదవిలో ఉన్నవారు చేసిన అవినీతి పనులపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మరి చూడాలికి ఈ ఎన్నికల్లో గెలుపెవరిదో.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 18, 2019, 1:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading