హోమ్ /వార్తలు /సినిమా /

Director Bala divorce: సెన్సేషనల్ డైరెక్టర్ బాల విడాకులు.. అభిమానులకు భారీ షాక్..

Director Bala divorce: సెన్సేషనల్ డైరెక్టర్ బాల విడాకులు.. అభిమానులకు భారీ షాక్..

దర్శకుడు బాల విడాకులు

దర్శకుడు బాల విడాకులు

Director Bala divorce: సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ప్రముఖులు విడిపోతున్నారు. విడాకులే శరణ్యంగా ముందడుగు వేస్తున్నారు. ఏళ్ల పాటు కలిసున్న వాళ్లైనా.. నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్లైనా.. ఎవరైనా కూడా గొడవలతో విడిపోతున్నారు..

ఇంకా చదవండి ...

సినిమా ఇండస్ట్రీలో విడాకుల పర్వం కొనసాగుతూనే ఉంది. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ప్రముఖులు విడిపోతున్నారు. విడాకులే శరణ్యంగా ముందడుగు వేస్తున్నారు. ఏళ్ల పాటు కలిసున్న వాళ్లైనా.. నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్లైనా.. ఎవరైనా కూడా గొడవలతో విడిపోతున్నారు.. విడాకులు తీసుకుని ఎవరి జీవితం వాళ్లు గడుపుతున్నారు. గత ఏడాది కాలంగా చాలా మంది స్టార్లు ఒకరి తర్వాత ఒకరు విడాకులు అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో ప్రముఖుడు కూడా విడాకులు అనౌన్స్ చేసాడు. ఆయనెవరో కాదు.. సంచలన దర్శకుడు బాల (Director Bala). శివపుత్రుడు (Shivaputhrudu), వాడు వీడు (Vaadu Veedu) లాంటి ఎన్నో సినిమాలు చేసిన ఈయన.. తమిళంలో సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన సినిమాలతోనే విక్రమ్ (Vikram) స్టార్ అయ్యాడు. ఆయన తాజాగా విడాకులు ప్రకటిస్తూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. సమంత-నాగ చైతన్య (Samantha - Naga Chaitanya), ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ (Dhanush - Aishwarya Rajinikanth) విడాకుల గురించి ఇంకా ఎవరూ మరిచిపోకముందే అప్పుడే బాల కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు.

తన భార్యతో ఈయన న్యాయబద్ధంగా విడిపోయాడు. ఈ మధ్యే ఆయనకు ఫ్యామిలీ కోర్టులో విడాకులు మంజూరు అయ్యాయి. 17 ఏళ్ల క్రితం ముత్తు మలర్‌తో బాలా పెళ్లి జరిగింది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు తలెత్తడంతో.. నాలుగేళ్ళ నుంచి విడిగానే ఉంటున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. బాల విడాకులు తీసుకున్న సంగతి తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చూడాలిక.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు