అపుడు నయన తార..ఇపుడు విశాల్ పై రాధారవి సంచలన వ్యాఖ్యలు..

రాధా రవి, విశాల్

ఇటీవలె చెన్నైలో జరిగిన ఫంక్షన్‌‌లో లేడీ సూపర్ స్టార్ పై సీనియర్ నటుడు రాధా రవి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా రాధారవి..విశాల్ పై చేసిన ట్వీట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

  • Share this:
ఇటీవలె చెన్నైలో జరిగిన ఫంక్షన్‌‌లో లేడీ సూపర్ స్టార్ పై సీనియర్ నటుడు రాధా రవి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. నడిగర సంఘానికి అధ్యక్షునిగా పనిచేసిన రాధా రవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది.దీంతో రాధారవి చేసిన పనికి డీఎంకే పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమ ఆయన్ని సినిమాల్లో తీసుకోవద్దంటూ తీర్మానం చేసింది. తాజాగా రాధారవి..నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌పై వ్యంగ్యంగా ట్వీట్ చేయడం వివాదంగా మారింది. ఇంతకీ ఏమన్నాడంటే విశాల్ ‌కు ఏమి తెలియక పోయినా..అన్ని విషయాల్లో తలదూరుస్తాడు. మరోవైపు రాధారవి తన పేరు విషయమై స్పందించాడు. తన తండ్రి పేరు ‘రాధ’.అందుకే నా పేరు ముందు వచ్చిందని వివరణ ఇచ్చాడు. ఇక విశాల్‌ పై ఈయన తీవ్ర వ్యాఖ్యలు వెనక ఒక కారణమే ఉంది. నయనతారపై అనుచితంగా మాట్లాడిన రాధారవిపై విశాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఒక నటిపై మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను.

After nayanathara..Actor radha ravi controversial comments on Vishal
రాధారవి, నయనతార


ఒక మహిళ వల్ల మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం లేకుండా ఆడవాళ్లను కించపరచడం తగదన్నారు. మీరు మీ పేరులోని ‘రాధ’ తొలిగించి ‘రవి’ అని మాత్రమే పిలిపించుకోండి అని ట్వీట్ చేసాడు. ఈ విషయమై రాధారవి తన పేరు విషయమై విశాల్‌కు వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు.

First published: