• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • TAMIL ATRESS NEELIMA ESAI REVERSE COUNTER TO NETIZEN WHO ASKED HER FOR ONE NIGHT PRICE PK

Neelima Esai: రాత్రికి ఎంత తీసుకుంటావ్.. హీరోయిన్‌తో నెటిజన్ అసభ్య ప్రవర్తన..

Neelima Esai: రాత్రికి ఎంత తీసుకుంటావ్.. హీరోయిన్‌తో నెటిజన్ అసభ్య ప్రవర్తన..

నీలిమ రాణి (Neelima Esai/Twitter)

Neelima Esai: సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడేటప్పుడు హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లే మాత్రం అలసత్వం ప్రదర్శించినా కూడా నోరు జారే ఆకతాయీలు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు లైవ్‌లోకి..

  • Share this:
సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడేటప్పుడు హీరోయిన్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లే మాత్రం అలసత్వం ప్రదర్శించినా కూడా నోరు జారే ఆకతాయీలు చాలా మంది ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోయిన్లు లైవ్‌లోకి వచ్చారంటే మాత్రం వాళ్లను ట్రోల్ చేయడానికి.. ఆట పట్టించడానికి ఓ బ్యాచ్ సిద్ధంగా ఉంటారు. ఎలాగైనా వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించాలని కంకణం కట్టుకుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తమిళ హీరోయిన్ నీలిమ ఎసయ్‌తో ఓ ఫాలోయర్ చాలా దారుణంగా మాట్లాడాడు. కమల్ హాసన్ 'దేవర్ మగన్‌' సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చింది నీలిమ. ఈ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు కూడా చేసింది ఈమె. ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీ అయిపోయింది నీలిమ. అన్ని భాషల్లో కూడా ఈమెకు అభిమానులున్నారు. తెలుగు, తమిళం, కన్నడ సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది నీలిమ ఎసయ్. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించడం కూడా ఈమెకు అలవాటు. ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా అభిమానులతో ముచ్చటించింది. అయితే ఓ అభిమాని మాత్రం చాలా నీచంగా ప్రశ్నలు అడిగాడు. "రాత్రికి ఎంత తీసుకుంటారు?" అంటూ అడిగాడు.. దానికి వెంటనే ఈమె కూడా తనదైన శైలిలో సమాధానమిచ్చింది.
neelima rani,neelima esai,neelima,neelima rani family photos,neelima rani husband,neelima rani photoshoot,neelima esai photoshoot,neelima rani interview,neelima rani photos,photos,neelima rani latest,actress neelima rani,neelima family photos,neelima rani song,neelima rani dance,actress neelima family photos,neelima rani family,neelima rani serial,neelima rani unseen photos,#neelima rani hot photos,neelima rani serials,neelima rani wedding photos,neelima rani hot,neelima rani photo gallery
నీలిమ రాణి (Neelima Esai/Twitter)

"బ్రదర్.. కొంత హుందాతనం మీ నుంచి నేను ఆశిస్తున్నా.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.. ప్రజలను వేధించడం అనేది పర్వర్ట్ మైండ్ వాళ్లు చేసే పని.. ఓ సైకాలజిస్ట్‌ని కలవండి ప్లీజ్‌.. మీకు సాయం అవసరం." అని అతడికి రిప్లై ఇచ్చింది. నెటిజన్ అడిగిన చెత్త ప్రశ్నకు చెంప పగిలేలా సమాధానమిచ్చింది నీలిమ. ఈమె తమిళంలో ప్రియసఖి, తిమిరు, మోళి, సంతోష్ సుబ్రమణియమ్‌, రాజాధి రాజా, నాన్ మహాన్ అల్ల, గజినీకాంత్‌, శత్రు లాంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం సినిమాలతో పాటు సీరియల్స్ కూడా చేస్తుంది నీలిమ. తెలుగులో కూడా మా టీవీలో ప్రసారమైన 'తాళికట్టు శుభవేళ' సీరియల్‌లో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగిన సంఘటన.. ఈమె ఇచ్చిన సమాధానంతో హాట్ టాపిక్ అయిపోయింది.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు