Namitha: బొద్దుగుమ్మ నమిత చిక్కింది.. జీరో సైజ్ అందాలు చూసి ఫ్యాన్స్‌ షాక్..

శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నమిత.తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అందుకోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అభిమానులకు షాక్ ఇస్తోంది.

news18-telugu
Updated: August 19, 2019, 4:58 PM IST
Namitha: బొద్దుగుమ్మ నమిత చిక్కింది.. జీరో సైజ్ అందాలు చూసి ఫ్యాన్స్‌ షాక్..
నమిత (Facebook/Photos)
  • Share this:
శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది నమిత.ఆ సినిమాలో మాత్రం ‘భైరవి’గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ‘జెమినీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా నమిత అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.  ఐనా ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఆ తర్వాత రవితేజతో ‘ఒకరాజు ఒకరాణి’, ప్రభాస్ హీరోగా నటించిన ‘బిల్లా’, బాలయ్య ‘సింహా’ లాంటి సినిమాలు చేసినా కూడా తెలుగులో ఈ భామకు కోరుకున్న క్రేజ్ మాత్రం దక్కలేదుతెలుగులో అంతంతమాత్రంగానే ఉన్నా తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది నమిత. అక్కడ ఈమెకు ఏకంగా గుడి కట్టేంతలా అభిమానుల క్రేజ్ సంపాదించుకుంది.  ఖుష్బూ తర్వాత అంత పాపులర్ అయిన ముద్దుగుమ్మ నమితే.

నమిత (Facebook/Photo)


తమిళనాట నమితతో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల వరకు అందరితో రొమాన్స్ చేసింది ఈ ముద్గుగుమ్మ. ఇన్నేళ్ల కెరీర్‌లో నమిత తమిళనాటే ఎక్కువ సినిమాలు చేసింది. కొత్త హీరోయిన్స్ రాకతో నమితకు అవకాశాలు తగ్గాయి. ఆ మధ్య కమల్ హాసన్ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఆ తర్వాత తన ప్రియుడు వీరేంద్ర చౌదరిని ప్రేమ వివాహాం చేసుకుంది. తాజాగా ఈ భామ కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. అందుకోసం ఏకంగా 15 కిలోల బరువు తగ్గి అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం నమిత సైజ్ జీరోకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 
First published: August 19, 2019, 3:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading