వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన హీరోయిన్..

Actress Vijaya Lakshmi: తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్య యత్నం చేసింది. దానికి ముందే ఆమె ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఆమె సూసైడ్ అటెంప్ట్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 26, 2020, 11:07 PM IST
వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన హీరోయిన్..
తమిళ నటి విజయలక్ష్మి (tamil actress Vijayalakshmi)
  • Share this:
తమిళ నటి విజయలక్ష్మి ఆత్మహత్య యత్నం చేసింది. దానికి ముందే ఆమె ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోతో పాటు ఆమె సూసైడ్ అటెంప్ట్ కూడా వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈమెకు చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స జరుగుతుంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వేధింపులు తట్టుకోలేక ఈమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే జులై 26న ఈమె ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని మాత్రలు మింగేసింది. తన ఫాలోయర్స్ సీమాన్, హరి నడర్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు వీడియోలో చెప్పింది విజయలక్ష్మి. ఫేస్ బుక్ వీడియోలో కూడా ఈ ఇద్దర్నీ హైలైట్ చేసింది ఈమె. ఇది తన చివరి వీడియో అంటూ మాట్లాడింది విజయలక్ష్మి.

గత నాలుగు నెలలుగా సీమన్, అతడి పార్టీ సభ్యులు చేస్తున్న పనులతో తాను చాలా ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పుకొచ్చింది ఈమె. తన కుటుంబాన్ని కాపాడుకోడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసినట్లు చెప్పింది. కానీ హరి నదర్ తన పరపతిని వాడి మీడియాలో తన గురించి చెడుగా చెప్పిస్తున్నాడని వాపోయింది. కొన్ని నెలలుగా బీపీ టాబ్లెట్స్ కూడా వాడుతున్నానని.. కచ్చితంగా ఏదో సమయంలో తన బిపీ పడిపోయి చచ్చిపోతానని చెప్తుంది ఈమె. తన చావు అందరికీ కనువిప్పు కావాలని చెప్పింది విజయలక్ష్మి. నామ్ తమిళర్ కచ్చి పార్టీ లీడర్ ఈ సీమన్.. పాండిచ్చేరీలోని ఓ తమిళ నేషనలిస్ట్ పార్టీ ఇది. హరి నదర్ కూడా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి. గత ఎన్నికల్లో నంగునేరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు కూడా. మొత్తానికి ఈ ఇద్దరి గురించి.. విజయలక్ష్మి ఆత్మహత్య ప్రయత్నం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: July 26, 2020, 11:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading