నా పర్మిషన్ లేకుండా కమల్ హాసన్ నాకు ముద్దు పెట్టాడు... నటి రేఖ సంచలన ఆరోపణలు..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటన గురించి చెప్పాల్సి వస్తే పెద్ద గ్రంథమే అవుతోంది. తాజాగా ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి రేఖ చేసిన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

news18-telugu
Updated: February 25, 2020, 4:46 PM IST
నా పర్మిషన్ లేకుండా కమల్ హాసన్ నాకు ముద్దు పెట్టాడు... నటి రేఖ సంచలన ఆరోపణలు..
కమల్ హాసన్, రేఖ ముద్దు సన్నివేశం (Youtube/Credit)
  • Share this:
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటన గురించి చెప్పాల్సి వస్తే పెద్ద గ్రంథమే అవుతోంది. తాజాగా ఆయన గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి రేఖ చేసిన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఆమె ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ హాసన్ పై విరుచుకుపడింది. గతంలో వీళ్లిద్దరు బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమాలో కమల్ హాసన్, రేఖ జంటగా నటించారు. ఆ సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఒక ముద్దు సీన్ ఉంది. ఆ ముద్దు సన్నివేశం గురించి తనకు ముందుగానే దర్శకుడు బాలచందర్ కానీ.. హీరో కమల్ హాసన్ కానీ చెప్పలేదు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా తన పర్మిషన్ లేకుండా కమల్ తనకు ముద్దు పెట్టేశారని రేఖ ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పున్నగాయ్ మన్నన్’ సినిమాలో హీరోయిన్ ఆత్మహత్య చేసుకునే సీన్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో కమల్ హాసన్ ఒక్కసారిగా ఉరుములేని మెరుపులా కమల్ నాకు ముద్దు పెట్టాశారు. కమల్ నాకు ముద్దు పెట్టేటపుడు నేను షాక్‌లో ఉన్నాను. ఏమైందో అర్థం అయ్యేలోపే అంతా జరిగిపోయింది.

tamil actress rekha sensational comments on kamal haasan due to kiss scene in Punnagai Mannan,Kamal Haasan,rekha,kamal haasan and Rekha jump from cliff,bala chander, Punnagai Mannan,kamal haasan rekha kiss scene,kamal haasan bharatheeyudu,కమల్ హాసన్, భారతీయుడు,కమల్ హాసన్ రేఖ ముద్దు సన్నివేశం,కమల్ హాసన్ రేఖ కిస్ సీన్,కమల్ హాసన్ బాలచందర్ రేఖ పున్నగాయ్ మన్నన్ మూవీ,పున్నగాయ్ మన్నన్ మూవీలో కమల్ హాసన్ రేఖ ముద్దు సన్నివేశం
కమల్ హాసన్, రేఖ ముద్దు సన్నివేశం (Youtube/Credit)


నా అనుమతి లేేకుండా కమల్ హాసన్ ముద్దు పెట్టడంతో నాకు కోపం వచ్చింది. షూటింగ్ అయిపోయాక నేను బాలచందర్ గారి దగ్గరకి వెళ్లి అడిగాను. అందుకు ఆయన.. ఈ ముద్దు సన్నివేశంలో ఎలాంటి అసభ్యత లేదని కమల్ హాసన్‌నే సపోర్ట్ చేయడం నాకు బాధ కలిగించిందన్నారు. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందని చూపించడానికే ఆ సీన్ పెట్టాం బాలచందర్ నాకు వివరణ ఇచ్చారు. ఆ సన్నివేశం తర్వాత నాకు కొన్ని రోజులు నిద్ర పోలేదు. అదో పీడకలలా నన్ను వెంటాడిందని రేఖ  ఆ ఇంటర్వ్యూలో తన గోడును వెళ్లబోసుకుంది. ప్రస్తుతం రేఖ పలు చిత్రాల్లో, టీవీ సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది. కమల్ హాసన్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంపై కోలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీస్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.
Published by: Kiran Kumar Thanjavur
First published: February 25, 2020, 4:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading