అవకాశాల కోసం పడుకోలేక ఇండస్ట్రీ వదిలేసానంటున్న హీరోయిన్..

Kalyani: సినిమా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ హీరోయిన్లు చాలా మంది మీటూ బాధితులే. అవకాశం అడిగితే చాలు కమిట్‌మెంట్ అడిగే వాళ్లు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 7:43 PM IST
అవకాశాల కోసం పడుకోలేక ఇండస్ట్రీ వదిలేసానంటున్న హీరోయిన్..
నటి కళ్యాణి ఉరఫ్ పూర్ణిత (actress poornitha)
  • Share this:
సినిమా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ హీరోయిన్లు చాలా మంది మీటూ బాధితులే. అవకాశం అడిగితే చాలు కమిట్‌మెంట్ అడిగే వాళ్లు కూడా చాలా మంది ఉన్నారంటూ ఇప్పటికే ఎందరో ముద్దుగుమ్మలు బయటికి వచ్చి చెప్పుకున్నారు. తెలుగులో శ్రీ రెడ్డి.. హిందీలో తను శ్రీదత్తా లాంటి వాళ్లు మీటూ గురించి బలంగా పోరాటం చేసారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇందులో భాగమైంది. తమిళనటి పూర్ణిత కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కళ్యాణి పేరుతో ఈమె అక్కడ సినిమాలు చేసింది. జయం సినిమా తమిళ రీమేక్‌లో సదా చెల్లి పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది.
నటి కళ్యాణి ఉరఫ్ పూర్ణిత (actress poornitha)
నటి కళ్యాణి ఉరఫ్ పూర్ణిత (actress poornitha)


ఆ పాత్రకు కళ్యాణి పేరు కావడంతో అదే పేరుతో తర్వాత సినిమాలు చేసింది ఈమె. ఇన్బా, కాత్తి కాప్పల్, ఎస్ఎమ్ఎస్, పెరుంతూ లాంటి సినిమాలు చేసిన కళ్యాణి.. ఆ తర్వాత ఉన్నట్లుండి ఇండస్ట్రీ నుంచి దూరమైపోయింది. తెలుగులో కూడా మళ్లీ మళ్లీ అనే సినిమా చేసింది ఈమె. అవకాశాలు వస్తున్నపుడే ఇండస్ట్రీని ఎందుకు వదిలేసావ్ అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పింది కళ్యాణి. అవకాశాలు ఇస్తామని అంతా పిలుస్తున్నారు.. మంచి సినిమాలే కదా వెళ్తే అక్కడ చివరికి వాళ్లు తమకేంటి.. పడుకోవాలి మాతో అంటూ అసభ్యకరంగా మాట్లాడటం అనేది కామన్ అయిపోయింది అంటుంది కళ్యాణి.
నటి కళ్యాణి ఉరఫ్ పూర్ణిత (actress poornitha)
నటి కళ్యాణి ఉరఫ్ పూర్ణిత (actress poornitha)

అందుకే తాను సినిమాలకు దూరమైపోయానని చెప్పింది. ఆమె తల్లిని కూడా అలాగే కమిట్మెంట్ కోసం వేధించారని.. అందుకే ఆమె కూడా సినిమాలకు దూరమైపోయిందని చెప్పింది ఈమె. కమిట్‌‌మెంట్ కానీ లేకపోయుంటే బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన తాను షాలిని, హన్సిక స్థాయికి ఎదిగి ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది కళ్యాణి. కానీ కొందరు కమిట్‌మెంట్ పేరుతో తన కెరీర్ నాశనం చేసారని ఆరోపించింది ఈమె. ప్రస్తుతం కళ్యాణి కామెంట్స్ తమిళనాట సంచలనం రేపుతున్నాయి.
First published: May 28, 2020, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading