హీరో లిప్ లాక్ సీన్ తట్టుకోలేక పారిపోయిన హీరోయిన్..

Heroshini Komali: హీరో గారి ముద్దు ధాటికి తట్టుకోలేక షూటింగ్ నుంచి పారిపోయింది తమిళ హీరోయిన్ హిరోషిణి కోమలి. ఊరికి వెళ్లిపోయి తాను రానని మొండికేసింది. ఈ విషయం గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో బాగానే చర్చ జరుగుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 28, 2020, 8:59 PM IST
హీరో లిప్ లాక్ సీన్ తట్టుకోలేక పారిపోయిన హీరోయిన్..
కోమలి హిరోషిణి (komali heroshini)
  • Share this:
తెలుగు సినిమాల్లో కూడా ఇప్పుడు ముద్దు సన్నివేశాలు బాగానే ఉంటున్నాయి. అసలు ఇప్పుడు లిప్‌లాక్ సీన్ లేని సినిమాలు రావడం లేదంటే అతిశయోక్తి కాదేమో..? ముఖ్యంగా మన హీరోలు కూడా మెల్లగా ముద్దులకు అలవాటు పడుతున్నారు. స్టార్ హీరోలు కూడా సీన్ డిమాండ్ చేస్తే ముద్దులు పెట్టేస్తాం అంటున్నారు. ఇక ఇప్పుడు ఓ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఓ హీరోయిన్ అయితే ఏకంగా హీరో ముద్దు ధాటికి తట్టుకోలేక షూటింగ్ నుంచి పారిపోయింది. ఈ విషయం గురించి ప్రస్తుతం కోలీవుడ్‌లో బాగానే చర్చ జరుగుతుంది. అక్కడితో ఆగకుండా ఆ చిత్ర దర్శకుడిపై కూడా హీరోయిన్ ఓ రేంజ్‌లో మండిపడిందని తెలుస్తుంది.

కోమలి హిరోషిణి (komali heroshini)
కోమలి హిరోషిణి (komali heroshini)


ఉన్నపలంగా షూటింగ్ నుంచి ప్యాకప్ చెప్పి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతుంది. ఈ సంఘటన తమిళ సినిమా ఉట్రాన్‌ విషయంలో జరిగింది. సాట్‌ సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 31వ తేదీన విడుదల కానుంది. రోషన్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో హిరోషిణి హీరోయిన్‌. తమిళ సినిమా కావడంతో ఎవరికీ పెద్దగా తెలియదు కానీ ఇప్పుడు హీరోయిన్ చేసిన రచ్చతో ఈ సినిమా పేరు బాగానే వినిపిస్తుంది. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా పాపులర్‌ అయిన హిరోషిణి ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అవుతుంది. రాజా గజనీ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఓ లిప్‌లాక్‌ సన్నివేశం ఉంది. ఇదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

కోమలి హిరోషిణి (komali heroshini)
కోమలి హిరోషిణి (komali heroshini)
కథ చెప్పేటప్పుడే లిప్ లాక్ సీన్ గురించి కూడా హీరోయిన్‌కు దర్శకుడు చెప్పినా కూడా షూటింగ్‌లో అది మరి అంత ఘాటుగా ఉంటుందని మాత్రం ఊహించలేదు సదరు హీరోయిన్. దీనిపై యూనిట్ మాట్లాడుతూ ఇద్దరి మధ్య ఈ సీన్ దర్శకుడు చిత్రీకరించారని తెలిపారు. అయితే ఈ సన్నివేశంలో హీరో మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి స్మూచ్ సీన్ చేసాడని.. దాంతో హీరోయిన్ ఆ దర్శకుడిపై కోపంతో విరుచుకుపడిందని తెలుస్తుంది. లిప్ లాక్ అంటే పెదాలపై పెదాలు ఆనించడమని.. స్మూచ్ అంటే పెదాలను దాటి నాలుకను చప్పరించడం అని చెబుతుంది ఈ హీరోయిన్.

కోమలి హిరోషిణి (komali heroshini)
కోమలి హిరోషిణి (komali heroshini)


ఇప్పుడు మీ హీరో ఇలాగే చప్పరిస్తున్నాడని హీరోయిన్ హిరోషిణి మండిపడింది. ఆ తర్వాత హీరోకు దర్శకుడు నచ్చచెప్పి లిప్ లాక్ సీన్ చేయించాడు. అయితే అప్పటికీ హీరో మళ్లీ అలాగే చేయడంతో హిరోషిణికి ఒళ్లు మండి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. చిత్రయూనిట్‌ ఎంత చెప్పినా వినకుండా ఊరుకు వెళ్లిపోయిందని చెప్పారు దర్శక నిర్మాతలు. ముద్దుల్లో ఇన్ని రకాలు ఉంటాయా అని హీరోయిన్ హిరోషిణి చెప్పిన తర్వాతే తనకు కూడా తెలిసిందని చెప్పాడు దర్శకుడు రాజా గజిని.
First published: January 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు