Actress Chandini: ఆ నటితో మాజీ మంత్రి రాసలీలలు.. అశ్లీల వీడియోలతో బెదిరింపులు.. చివరికి?

Actress Chandini

Actress Chandini: ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్స్ ఎంతోమంది వేధింపులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

  • Share this:
    Actress Chandini: ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్స్ ఎంతోమంది వేధింపులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాకుండా వాళ్లు అడిగింది ఇవ్వకుంటే.. వాళ్లు సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలతో నెట్టింట్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది తమకు జరిగిన వేధింపుల గురించి మీడియా ద్వారా బయట పెడుతూ ఉంటే మరికొందరు లోలోపలే వాటిని దిగమింగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నటి తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తాజాగా బయట పెట్టింది

    నోమాడ్స్ సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న మలేషియా బ్యూటీ చాందిని. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాను గతంలో ఓ ప్రైవేటు ఈవెంట్ లో పాల్గొన్నప్పుడు ఓ మాజీ మంత్రి తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త పెరిగి సహజీవనం గా మారగా.. ప్రస్తుతం పెళ్లికి అంగీకరించడం లేదని నటి చాందిని తన వేదనను బయటకు తెలిపింది.

    తమిళ్ నాడు లో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రామథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు మణికందన్. ఇక ఈయన నటి చాందినీ తో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఐదేళ్లుగా శారీరకంగా వాడుకున్నాడు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోమని చాందిని కోరగా చేసుకోనని.. దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది చాందిని.

    తనను శారీరకంగా బాగా వేధించాడని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని తనకు న్యాయం చేయాలంటూ.. గత 5 ఏళ్ల నుండి సహజీవనం చేయగా ఇప్పుడు పెళ్లి గురించి ప్రశ్నిస్తే నో చెబుతున్నాడని, గట్టిగా నిలదీస్తే తనతో ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరించడం తో పాటు రౌడీలతో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని చెన్నై సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చాందిని ఫిర్యాదు చేసింది.
    Published by:Navya Reddy
    First published: