Meera Mitun: పోలీసులకు చెమటలు పట్టించిన బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్ అవుతున్న లీకైన వీడియో!

Meera Mitun

Meera Mitun: గత కొద్ది రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులను తరిమికొట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ, నటి మీరా మీథున్‌ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    Meera Mitun: గత కొద్ది రోజుల క్రితం సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులను తరిమికొట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ, నటి మీరా మీథున్‌ పై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్న సంగతి తెలిసిందే. దళితులపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నటిని వెంటనే అరెస్టు చేయాలని, ఆమెకు తగిన శిక్ష వేయాలంటే దళిత సంఘాల నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. అదేవిధంగా అంతేగాక దళిత-కేంద్రీకృత పార్టీ అయిన విడుదలై చిరుతైగళ్‌ కట్చి పార్టీ ఉప కార్యదర్శి వన్నీయరసు మీరాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఈమె పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

    సినిమా ఇండస్ట్రీలో ఉండే దళితులకు ఎలా ప్రవర్తించాలో తెలియదని, వారందరూ చీప్ మెంటాలిటీ తో వ్యవహరిస్తారని,అలాంటి వారిని ఇండస్ట్రీలో లేకుండా తరిమికొట్టాలని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆమె మెడకి చుట్టుకున్నాయి. దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి పై పోలీసులు కేసు నమోదు చేయడమే కాకుండా పోలీసు కమిషనర్ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని కోరడంతో సదరు నటి స్పందిస్తూ..పోలీసులు నన్ను కలలో కూడా అరెస్టు చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

    సదరు నటి ఈ విధంగా పోలీసులకు సవాల్ విసరడంతో పోలీసులు ఈమెను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే కేరళలో దాక్కున్న నటిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసే సమయంలో సదరు నటి నానా హంగామా చేసింది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక్కడ ఆడవాళ్ళకి రక్షణ లేదా? ప్రధాని మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌ స్పందించండి అంటూ అరుస్తున్న వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.



    అదే విధంగా పోలీసులు తననే టార్గెట్ చేస్తున్నారని, పోలీసులు నన్ను టచ్ చేస్తే కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంటానని నటి బెదిరించింది. అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రికి, ప్రధాన మోడీకి ఇది తమిళనాడు పోలీసులు చేస్తున్న హింస అంటూ ఈ ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published: