దర్శకుడి తనయుడు కన్నుమూత.. 23 ఏళ్ల వయసులోనే..

Sharook Kapoor: తమిళ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్‌ కుమారుడు షారూఖ్‌ కపూర్‌ అనారోగ్యంతో మరణించాడు. కొన్ని రోజులుగా ఈ కుర్రాడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు షారుక్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 19, 2020, 1:58 PM IST
దర్శకుడి తనయుడు కన్నుమూత.. 23 ఏళ్ల వయసులోనే..
తమిళ నటుడు రాజ్ కపూర్ తనయుడు శేఖర్ కపూర్ కన్నుమూత(raj kapoor son sharook kapoor death)
  • Share this:
23 ఏళ్లు.. కేవలం 23 ఏళ్లంటే ఎంత చిన్న వయసు. ఇంకా జీవితంలో ఏం చూడలేదు కూడా. అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయాడు ఆ కుర్రాడు. త్వరలోనే ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కావాల్సిన నటుడు కాస్తా వెండితెర మొహం చూడకుండానే కన్నుమూసాడు. ఈ విషాదం తమిళ ఇండస్ట్రీలో జరిగింది. అసలే ఈ మధ్య ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు రాజ్‌కపూర్‌ కుమారుడు షారూఖ్‌ కపూర్‌ అనారోగ్యంతో మరణించాడు. కొన్ని రోజులుగా ఈ కుర్రాడు అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ముఖ్యంగా శ్వాసకోస సంబంధిత వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడు షారుక్.
తమిళ నటుడు రాజ్ కపూర్ తనయుడు శేఖర్ కపూర్ కన్నుమూత(raj kapoor son sharook kapoor death)
తమిళ నటుడు రాజ్ కపూర్ తనయుడు శేఖర్ కపూర్ కన్నుమూత(raj kapoor son sharook kapoor death)

దాంతో అతని ఆరోగ్యం బాగుపడితే మక్కాకి తీసుకొస్తానని షారుక్ తల్లి మొక్కుకుంది. అనుకున్నట్లుగానే ఆరోగ్యం కుదుటపడటంతో మక్కాకు వెళ్లారు. అయితే అక్కడ వాతావరణం షారుక్‌కు సెట్ కాలేదు. దాంతో అనారోగ్యం మళ్లీ తిరగబెట్టింది. దాంతో శ్వాసకోస వ్యాధి తీవ్రమై అక్కడే చనిపోయాడు. రాజ్‌కపూర్‌ తనయుడి మరణవార్త విని కోలీవుడ్ అంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. తనయుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజ్ కపూర్.. కొడుకు శవాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. చిన్న వయస్సులోనే ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో రాజ్ కపూర్‌తో పాటు ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

తమిళ నటుడు రాజ్ కపూర్ తనయుడు శేఖర్ కపూర్ కన్నుమూత(raj kapoor son sharook kapoor death)
తమిళ నటుడు రాజ్ కపూర్ తనయుడు శేఖర్ కపూర్ కన్నుమూత(raj kapoor son sharook kapoor death)

ఈ ఘటనతో సినీ పరిశ్రమ కూడా షాక్ అయింది. తమిళనాట రాజ్ కపూర్‌కు దర్శకుడిగా మంచి గుర్తింపు ఉంది. ఆయన అక్కడ 'తాలాట్టు కేట్కు దమ్మా', 'అవన్‌ వరువాళా', 'ఆనంద పూంగాట్రు' లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. దాంతో పాటు చాలా సినిమాల్లో నటించాడు కూడా. తెలుగు సినిమాలు కూడా చేసాడు ఈయన. త్వరలోనే షారుక్ కపూర్‌ను వెండితెరకి పరిచయం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో ఇలా తనయుడు మరణించడంతో ఆయన పూర్తిగా షాక్‌లోకి వెళ్లిపోయాడు.

First published: February 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు